మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’ స్టార్ కాస్ట్ దుబాయ్‌లోని ఐకానిక్ గ్లోబల్ విలేజ్‌లో సందడి చేసింది. రణబీర్ కపూర్, బాబీ డియోల్ సమక్షంలో ‘అర్జన్ వైలీ’ పాట గ్లోబల్ విలేజ్ వేదికగా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
‘అర్జన్ వైలీ’ పాటతో గ్లోబల్ విలేజ్ మార్మోగింది. డ్యాన్సర్‌లు, పెద్ద ఎత్తుకున్న హాజరైన అభిమానులతో ఈ వేడుక కన్నుల పండగగా జరిగింది.
‘అర్జన్ వైలీ’ పాటకు స్టార్ కాస్ట్, అభిమానుల చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. అభిమానులు సెల్ఫీలు తీసుకుంటూ, అద్భుతమైన స్టార్ కాస్ట్ ఇంటరాక్షన్ తో ఈ వేడుక అట్టహాసంగా సాగింది. గ్లోబల్ విలేజ్‌లో జరిగిన పాట ఆవిష్కరణ స్టార్ పవర్, మ్యూజికల్ మ్యాజిక్ ని మిళితం చేసింది.
యానిమల్ లో రణబీర్ కపూర్ తో పాటు బాబీ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ యానిమల్ చిత్రాన్ని నిర్మించాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ రైడ్ ని అందించే ఈ క్రైమ్ డ్రామా డిసెంబర్ 1, 2023న గ్రాండ్ గా విడుదల కానుంది.
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…