వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “అనంతం”. ఈ చిత్రంలో రుచిత సాధినేని, రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. “అనంతం” సినిమాను ఆరుద్ర ప్రొడక్షన్స్ సమర్పణలో విజయ లక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. సాయిచరణ్ రెడ్డి రేకులతో కలిసి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు వెంకట శివకుమార్. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న “అనంతం” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో నిఖిల్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. “అనంతం” సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుందని చెప్పిన హీరో నిఖిల్, మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు. ఈ సందర్భంగా
నిర్మాతలు విజయలక్ష్మి, సుధీర్ మాట్లాడుతూ – మా అనంతం మూవీ టీజర్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా అనంతం సినిమాను నిర్మించాం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్ గా మూవీ ఉంటుంది. మూవీ పూర్తయ్యింది. త్వరలోనే మంచి తేదీ చూసి గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.
నటీనటులు – వెంకట్ శివకుమార్, రుచిత సాధినేని, రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు, తదితరులు
టెక్నికల్ టీమ్
డీవోపీ – రాహుల్ కేజీ విఘ్నేష్, దీపక్ కుమార్
మ్యూజిక్ – స్నిగ్ధ నయని
ఎడిటర్ – పవన్ కల్యాణ్ కొదాటి
పీఆర్ఓ – వీరబాబు
ప్రొడ్యూసర్స్ – విజయలక్ష్మి, సుధీర్
స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ – సాయిచరణ్ రెడ్డి రేకుల, వెంకట శివకుమార్
డైరెక్టర్ – వెంకట శివకుమార్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…