ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని నిర్మాత‌గా రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎల్‌జీఎం’

కుటుంబంలోని మ‌నుషులు అంద‌రూ ఒకేలా ఉండాల‌నేం లేదు.. ఒక్కొక్కరి మ‌న‌స్త‌త్వం ఒక్కోలా ఉంటుంది. దీని వ‌ల్ల మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌స్తుంటాయి..పోతుంటాయి. కానీ బంధాలు, బంధుత్వాల‌ను మ‌నం విడిచి పెట్ట‌లేం. ముఖ్యంగా కొత్త పెళ్లి చేసుకోవాల‌నుకునే అబ్బాయి, అమ్మాయిల‌కు మ‌న‌సులో తెలియ‌ని భ‌యాలు ఎన్నో ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య ఉండే రిలేష‌న్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా మ‌న‌సుకి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌నుకున్న అమ్మాయి కాబోయే అత్త‌గారి గురించి భ‌యప‌డుతుంది. అందు కోసం ఆమెతో క‌లిసి కొన్ని రోజుల పాటు ఆమెతో క‌లిసి ట్రావెల్ చేయాల‌నుకుంటుంది. అందుకు ఒప్పుకున్న అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య ఉండే కండీష‌న్స్ ఏంటి? చివ‌ర‌కు వారిద్ద‌రూ మ‌న‌స్త‌త్వాలు క‌లిశాయా? అనే వైవిధ్య‌మైన పాయింట్‌తో తెర‌కెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married). ఆగస్ట్ 4న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్‌.ఫిల్మ్స్‌, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాయి.

ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో హరీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియాలే ఈ సినిమాకు ప్రధాన బ‌లం. పెళ్లికి ముందే కాబోయే అత్త‌గారికి కండీష‌న్స్ పెట్టిన గ‌డుస‌రి కోడ‌లుగా ఇవానా క‌నిపిస్తుంది. ల‌వ్ టుడే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ఇవానా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఆమె న‌ట‌న ఎలా ఉండ‌బోతుంద‌నేది ట్రైల‌ర్‌లో చిన్న ట‌చ్‌తో చూపించించారు ద‌ర్శ‌కుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి. ఇక కొడుకు ప్రేమ కోసం కోడ‌లి పెట్టిన కండీష‌న్స్‌ను ఒప్పుకుని ఆమెతో ట్రావెల్ చేసే త‌ల్లి పాత్ర‌లో న‌దియా న‌టించారు. ఎన్నో చిత్రాల్లో త‌ల్లి, అత్త‌.. వంటి వైవిధ్య‌మైన క్యారెక్టర్స్‌లో మెప్పించిన న‌దియా గురించి తెలుగు ఆడియెన్స్‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ఇటు కాబోయే భార్య‌.. ప్రేమ‌గా పెంచుకున్న త‌ల్లి మ‌ధ్య భావోద్వేగాల‌తో న‌లిగిపోతూ ఇబ్బంది ప‌డే అబ్బాయిగా హరీష్ క‌ళ్యాణ్ న‌టించారు. ఇక సినిమాలో యోగిబాబు త‌న‌దైన కామెడీతో న‌వ్వించ‌నున్నారు.

ఇండియ‌న్ లెజెండ్రీ క్రికెట‌ర్ ఎం.ఎస్‌.ధోని ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married)తో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్‌ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని, వికాస్ హ‌స్జా నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 4న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago