టాలీవుడ్

సినీ సంగీత క‌ళాకారుల‌కు అమోర్ ఆస్ప‌త్రిలోలైఫ్‌టైంప్రివిలేజ్ కార్డు

సినీ సంగీత క‌ళాకారుల‌కు అమోర్ ఆస్ప‌త్రిలో లైఫ్‌టైం ప్రివిలేజ్ కార్డు
* రెండు రోజుల పాటు ప‌లు సూప‌ర్ స్పెషాలిటీ విభాగాల్లో ఉచిత వైద్య‌సేవలు
* లైఫ్‌టైం ప్రివిలేజ్ కార్డుతో జీవితాంతం ప‌లు ర‌కాల రాయితీలు
* మెడిక‌ల్ ప్లానెట్‌కు వ‌చ్చిన‌ట్లుంద‌న్న సంగీత ద‌ర్శ‌కుడు కోటి
* ఆయ‌న చేతుల మీదుగా ప్రివిలేజ్ కార్డు ఆవిష్క‌ర‌ణ‌

హైద‌రాబాద్‌, మార్చి 17, 2023: తెలుగు సినీ సంగీత రంగానికి అంత‌ర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు వ‌స్తోంద‌ని, ఇలాంటి త‌రుణంలో ఈ రంగానికి చెందిన క‌ళాకారుల‌ను గుర్తించి, వారి ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించేందుకు అమోర్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ముందుకురావ‌డం, ప‌లు ర‌కాల స‌దుపాయాలు క‌ల్పించ‌డం ముదావహ‌మ‌ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి అన్నారు. న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన అమోర్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో తెలుగు సినీ సంగీత క‌ళాకారుల యూనియ‌న్ స‌భ్యులు సుమారు 580 మందికి గురు, శుక్ర‌వారాల్లో రెండు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించారు. ఇందులో ప‌లు సూప‌ర్ స్పెషాలిటీ క‌న్స‌ల్టేష‌న్లతో పాటు వారంద‌రికీ ప‌లు ర‌కాల వైద్య ప‌రీక్ష‌ల‌ను ఉచితంగా నిర్వ‌హించారు. వీటితో పాటు తెలుగు సినీ సంగీత క‌ళాకారుల యూనియ‌న్ స‌భ్యులంద‌రికీ లైఫ్‌టైం ప్రివిలేజ్ కార్డు అందించారు. ఈ కార్డును సంగీత ద‌ర్శ‌కుడు కోటి చేతుల మీదుగా శుక్ర‌వారం ఆవిష్క‌రించారు. ఈ కార్డు ద్వారా యూనియ‌న్ స‌భ్యులంద‌రికీ ప‌లు ర‌కాల స‌దుపాయాలు క‌ల్పించారు. వీటిలో, క‌న్స‌ల్టేష‌న్లు ఉచితంగా చేస్తూ, ఇన్‌పేషంట్లుగా చేరాల్సి వస్తే అన్నిరకాల సేవల మీద జీవితాంతం 50% రాయితీ అందిస్తున్నారు. అంతేకాక‌.. న‌గ‌రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఉచితంగా అంబులెన్సు సేవ‌లు క‌ల్పిస్తారు.

ఈ సందర్భంగా సంగీత దర్శ‌కుడు కోటి మాట్లాడుతూ, ‘‘ఈరోజు నాకు ఒక మెడికల్ ప్లానెట్ కి వచ్చినట్లు అనిపించింది. ఇంత అత్యాధునిక సదుపాయాలు, టెక్నాలజీతో ఉన్న ఆస్పత్రికి రావడంఎంతో బాగుంది. అస‌లు లోప‌ల‌కు ప్రవేశించగానే వ్యాధి తగ్గిపోయేంత బాగుంది. డాక్టర్ కిశోర్ బి. రెడ్డికి శతకోటి ధన్యవాదాలు. కూకట్ పల్లి లాంటి సెంటర్లో ఇంత అత్యాధునిక సదుపాయాలున్న ఆస్పత్రిలో ప్రత్యేకరాయితీలను మా సంగీత కళాకారులకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. వైద్యులందరికీ మా అందరి తరఫున కృతజ్ఞ‌త‌లు, ధన్యవాదాలు. చెన్నైలోని ఎంజీఆర్ ఆస్పత్రికి ఎవరు వెళ్లినా చికిత్స చేయించుకుని రావడమే తప్ప, మరణాల రేటు అన్నదే లేదు. అలాంటి వాతావరణం మళ్లీ అమోర్ ఆస్పత్రిలోనే చూస్తున్నాం’’ అన్నారు.

మ‌రో ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ, ‘‘అమోర్ ఆస్పత్రి సేవలను రాయితీ ధరలతో సినీ సంగీత క‌ళాకారుల‌కు అందిస్తున్న డాక్ట‌ర్ కిశోర్ బి రెడ్డికి ధన్యవాదాలు. సినీ సంగీత క‌ళాకారులు, వాళ్ల కుటుంబాలకు ఇదెంతో సాయం అవుతుంది. ఏ సమస్య వచ్చినా చికిత్స చేయగల సమర్థులైన వైద్యులు, స‌దుపాయాలు అందుబాటులో ఉన్న ఈ ఆస్ప‌త్రి సేవ‌ల‌ను మావాళ్లు అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఇక్కడకు వస్తే, ఒక్కసారి ఇక్కడి వైద్యులు, సిబ్బంది, సదుపాయాలను చూస్తే మళ్లీ ఏ చిన్న అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా ఇక్కడకే రావాలని అనిపిస్తుంది’’ అని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రి సీఎండీ, ప్ర‌ముఖ ఆర్థో ఆంకాల‌జీ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ కిశోర్ బి.రెడ్డి మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఉన్న సంస్కృతి, క‌ళ‌ల‌ను కాపాడుతున్న‌వారు సినీ క‌ళాకారులే. అందులోనూ తెలుగు జాతికి అంత‌ర్జాతీయ స్థాయిలో అత్యున్న‌త సినీ అవార్డైన ఆస్కార్ అవార్డును కూడా సినీ సంగీత క‌ళాకారులే తీసుకొచ్చారు. అలాంటి వారిని కాపాడుకోవ‌డం మా బాధ్య‌త. అందులో భాగంగానే త‌మ ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయ‌కుండా క‌ళామ‌త‌ల్లి సేవ‌లోనే జీవితం గ‌డుపుతున్న సినీ సంగీత క‌ళాకారుల కోసం అమోర్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఈ రెండు రోజులు ఉచితంగా సూప‌ర్ స్పెషాలిటీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. వారికి భ‌విష్య‌త్తులో ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చినా కాపాడేందుకు వీలుగా యూనియ‌న్ స‌భ్యులంద‌రికీ లైఫ్‌టైం ప్రివిలేజి కార్డులు అందిస్తున్నాం. క‌ళాకారులంతా ఈ సేవ‌ల‌ను వినియోగించుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాల‌ని కోరుకుంటున్నాం అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు ఆర్‌పీ ప‌ట్నాయ‌క్, కేఎం రాధాకృష్ణ‌, క‌ళ్యాణ్ మాలిక్‌, తెలుగు సినీ సంగీత క‌ళాకారుల యూనియ‌న్ అధ్య‌క్షురాలు విజ‌య‌ల‌క్ష్మి, కార్య‌ద‌ర్శి కె.రామాచారి, ఉపాధ్య‌క్షుడు జైపాల్ రాజ్‌, కోశాధికారి ర‌మ‌ణ‌, సంయుక్త కార్య‌ద‌ర్శి మాధ‌వి పాల్గొన్నారు. వారితో పాటు అమోర్ ఆస్ప‌త్రి వైస్ ప్రెసిడెంట్ పి.ఎన్. నాగేంద‌ర్ రావు, డిప్యూటీ మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ జ‌య‌శేఖ‌ర్‌, ఫెసిలిటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ స‌తీష్ పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

12 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago