విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో కీలక పాత్రలో అమ్ము అభిరామి!

Must Read

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ఇప్పటికే పలువురు తారలు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రేమిస్తే భరత్‌, సునీల్‌, పాలడబ్బా తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో ప్రముఖ తమిళ నటి అమ్ము అభిరామ్‌ చేరారు.

తమిళ చిత్రలు రాట్సానన్‌, అసురన్‌ చిత్రంలో ఈ ఈమె తన అభినయంతో మంచి పేరు తెచ్చుకున్నారు. గోలీసోడా ఫ్రాంఛైజీగా ప్రముఖ దర్శకుడు, కెమెరామెన్‌ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. గతంలో విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో వచ్చిన గోలీసోడా వెబ్‌ సీరిస్‌లో కూడా అమ్ము అభిరామి మంచి పాత్రను చేశారు. ఇది ఈ ఇద్దరి కలయికలో రెండో చిత్రం. ఈ చిత్రంలో అమ్ము అభిరామి పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా కూడా ఉంటుందని, ఆమె అభినయం, పాత్ర చిత్రానికి ప్లస్‌ అవుతుందని, ఆమెలోని పలు కొత్తకోణాలు ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నామని అంటున్నారు దర్శకుడు విజయ్‌ మిల్టన్‌.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News