జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రాంతీయ సరిహద్దులను దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించారు. గంగోత్రి నుండి పుష్ప వరకు తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ‘పుష్ప: ది’ రైజ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా గుర్తింపును అందుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అల్లు అర్జున్ తో ఇన్‌స్టాగ్రామ్ చేసిన ఓ స్పెషల్
వీడియో అదుర్స్ అనిపించేలా ఉంది. ఒక రోజంతా ఇన్‌స్టాగ్రామ్ టీమ్ ఈ ఐకాన్ స్టార్ తోనే ఉంది. ఫస్ట్ టైం అమెరికాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ టీం స్వయంగా హైదరాబాద్ వచ్చి ఓ రోజంతా అల్లు అర్జున్ గారితో గడపడం విశేషం .
ఈ వీడియోలు బన్నీ దినచర్యను వీరు చూపించారు. ఉదయం లేచినప్పటి నుంచీ షూటింగ్ ముగిసే వరకూ తాను ఏయే పనులు చేస్తారో ఆ వీడియోలో వివరించారు.
సెట్స్ లోకి తీసుకెళ్లే ముందు తన ఇంట్లోనూ అర్జున్ ఓ టూర్ వేసి చూపించారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు తీసుకెళ్లడంతోపాటు అక్కడ మూవీ కోసం వేసిన సెట్స్, తన కాస్ట్యూమ్స్, డైరెక్టర్ సుకుమార్, మూవీ షూటింగ్.. ఇలా ఈ వీడియోలో చూపించారు.
“పుష్ప 2″ సెట్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ ఉదయాన్నే కాస్త చిల్ అవుతారు” అంటూ ఈ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ వీడియోలో బన్నీ చేసిన కామెంట్స్ ను కూడా క్యాప్షన్ రూపంలో చెప్పింది. “ఇండియాలో అభిమానులు చాలా భిన్నం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది కనిపించదు. మీరు చూడాల్సిందే. దీనిని వర్ణించలేం” అంటూ చెప్పడం అల్లు అర్జున్ గ్లోబల్ లెవెల్ లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారు అర్థమవుతుంది.
“హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇది. ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోల్లో ఇదీ ఒకటి. పుష్ప 2: ది రూల్ షూటింగ్ ఇక్కడే జరుగుతుంది” అని ఫిల్మ్ సిటీ గురించి బన్నీ వివరించారు. అభిమానులే తనకు మోటివేషన్ అని, వాళ్ల ప్రేమే తాను తన సరిహద్దులను చెరిపేస్తూ ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తోందని అన్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…