తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన హస్పటల్‌ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ గారు మాట్లాడుతూ

” అందరికి నమస్కారం.. ఇప్పుడే హస్పటల్‌లో ఉన్న శ్రీతేజ్‌ను ఐసీయూలో చూశాను. డాక్టర్లందరితోనూ మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవరీ అవుతున్నాడు. గత 14 రోజుల్లో.. లాస్ట్‌ 10 డేస్‌ల్లో రికవరీ బాగా కనిపిస్తుంది. బట్‌ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. అయితే శ్రీతేజ్‌ కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం. దీంతో పాటు ప్రభుత్వం కూడా మేము కూడా శ్రీతేజ్‌ను సంపూర్ణ ఆరోగ్యంగా చూడటానికి రెడీగా ఉన్నాం అని చెప్పడ అభినందనీయం. చాలా మంది అభిమానులు, బందువులు, మిత్రులు అల్లు అర్జున్‌ ఎందుకు హస్పటల్‌కు వెళ్లలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం. తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఉదయమే అర్జున్‌ హస్పటల్‌కు వెళ్లదామనుకున్నాడు. కానీ హస్పటల్‌ అధికారులు నిన్నే కదా ఈ సంఘటన జరిగింది. మీరు హస్పటల్‌కు వచ్చే కార్యక్రమం వాయిదా వేసుకోమని అన్నారు. కరెక్ట్‌ అనిపించింది. అందుకే రాలేదు. ఇక ఆ రోజే అర్జున్‌పై కేసు వచ్చింది. ఆ కేసులో లీగల్‌ టీమ్‌ హెడ్‌ నిరంజన్‌ రెడ్డి హస్పటల్‌కు వెళ్లకూడదు.. వారిని కలవకూడదు అని ఆయన స్ట్రాంగ్‌గా చెప్పారు. ఆ తరువాత మేము రావడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఇక బన్నీ ఒక రోజు బాధపడుతూ నేను చూడలేకపోయాను..

మీరైనా వెళ్లండి.. డాడీ అన్నాడు. అందుకే నేను ఇక్కడికి రావడానికి ముందు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకున్నాను. ఈ రోజు వచ్చాను. ఈ అనుమతి నాకు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్‌ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పోలీస్‌ శాఖ వారికి, హస్పటల్‌ యజమాన్యానికి, సీఇవో అభిమన్యు, మెడికల్‌ డైరెక్టర్‌ సంహిత్‌కు అందరికి నా కృతజ్క్షతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago