శ్రీ రామనవమి సందర్భంగా ఆదిపురుష్ ప్రమోషన్స్ మొదలు..

Must Read

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16 న విడుదల కాబోతోంది. ఈ శ్రీ రామ నవమి నుంచి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. ఈ సందర్బంగా దర్శకుడు ఓమ్ రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ మాతా వైష్ణో దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఆశిస్సులు అందుకున్నారు.


ఈ 2023 లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా నిలిచిన ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీ రాముడిని, కృతి సీతను, సైఫ్ అలీఖాన్ రావణుడిని పోలిన పాత్రల్లో కనిపించబోతున్న్నారు. హనుమంతుడుగా సన్నీ సింగ్ నటించాడు. చెడుపై గెలిచిన మంచిని చూపిస్తూ .. ఆధునిక కాలానికి అన్వయించి రాబోతోన్న ఆదిపురుష్ తో ప్రభాస్ మరో భారీ హిట్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ఈ నెల 30 నుంచి భారీ స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి.
ఓమ్ రౌత్ డైరెక్ట్  చేసిన ఈ చిత్రాన్ని తో సిరీస్, భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ లు యూ.వి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Latest News

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ...

More News