బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ ఆలియాభట్ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ ఫిల్మ్ ‘ఆల్ఫా’కోసం షూటింగ్ మొదలుపెట్టారు. అత్యంత భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ఆల్ఫా సినిమా. యష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్ మూవీ ‘ఆల్ఫా’. ఇటీవల గ్రాండ్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ కి హాజరయ్యారు నటి ఆలియా భట్.
ఇప్పుడు వైరల్ అవుతున్నది ‘ఆల్ఫా’లో ఆలియా అసలైన లుక్ కాదు. సినిమాలో ఆమె లుక్ ఎవరి ఊహలకూ అందనంత గొప్పగా ఉంటుంది. ఆమె సెట్స్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు క్లిక్‌మనిపించిన లుక్కే వైరల్ అవుతోంది. అసలు ఆల్ఫా సెట్స్ నుంచి లుక్ లీక్ అయ్యే ఛాన్సే లేదు. సెట్‌కి అంతగా భద్రతను కల్పించింది యూనిట్.
ఫస్ట్ ఫీమేల్ లీడ్ యష్‌రాజ్ స్పై యూనివర్శ్‌గా తెరకెక్కుతోంది ‘ఆల్ఫా’. ఇందులో ఆలియా సూపర్ ఏజెంట్‌గా నటిస్తారు. శివ రవైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ లో ఇంతకు ముందు ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్ట్ ‘ది రైల్వే మెన్’ కు డైరక్ట్ చేసిన ఘనత శివ రవైల్‌ది. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఆధారంగా తెరకెక్కిన ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు ఆడియన్స్.
యష్‌రాజ్ స్పై వర్శ్ గురించి చెప్పుకోవాలంటే ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్3 సినిమాలను ప్రస్తావించకుండా ఉండలేం. ప్రేక్షకుల్లో అత్యంత భారీ విజయాన్ని అందుకున్న సినిమాలవి. ఈ చరిష్మాతోనే ప్రస్తుతం ‘ఆల్ఫా’ను కాన్ఫిడెంట్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వార్2 తెరకెక్కుతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…