ఆలా ఇలా ఎలా చిత్రం ఆడియో విడుదల వేడుక

Must Read

కాకా మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు పి వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా రాజ్ శంకర్, పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రలో రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఆలా ఇలా ఎలా”. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన బాణీలను హిందూపూర్ ఊర్లో జనసందోహంలో అంగరంగవైభోగంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో లోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినొచ్చు. ఈ చిత్రాన్ని జులై 21న భారత దేశం అంతటా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది.

ఈ ఆడియో విడుదల వేడుకకి వై ఎస్ ఆర్ సి పి ఎమ్ ఎల్ సి షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్ ని మరియు ఆడియో ని విడుదల చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ఆలా ఇలా ఎలా” చిత్రం ట్రైలర్ ను ఇప్పుడు చూసాం, చాలా బాగుంది, ఇలాంటి వేడుక హిందూపూర్ లో జరగడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత కొల్లకుంట నాగరాజు గారికి ఈ చిత్రం మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి గారు మాట్లాడుతూ “ఆలా ఇలా ఎలా” ట్రైలర్ చాలా బాగుంది, నిర్మాత కొల్లకుంట నాగరాజు గారికి నా శుభాకాంక్షలు. రాజకీయాల్లో మేము ఎంత విజయం సాధించామో నిర్మాత నాగరాజు గారు కూడా ఈ చిత్రం తో సినీరంగం లో కూడా అంతటి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

హీరోయిన్ నిషా కొఠారి మాట్లాడుతూ “నేను ఈ వేడుకకి రావటం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని నిర్మించి విడుదల చేస్తున్న నిర్మాత నాగరాజు గారికి నా కృతజ్ఞతలు. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ అధినేత ఆదినారాయణ మాట్లాడుతూ “హిందూపూర్ లో “ఆలా ఇలా ఎలా” ఆడియో రిలీజ్ వేడుక జరగటం చాలా ఆనందంగా ఉంది. హిందూపూర్ లో ఉన్న ప్రతి ఒక మనిషి మా ఫంక్షన్ కి వచ్చి మా నిర్మాత నాగరాజు గారిని మా చిత్రాన్ని ఆశీర్వదించటానికి వచ్చారు అందరికి ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని నేను చూసాను, మణిశర్మ గారి సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది, తర్వాత హీరో శక్తి గారి నటన చాలా అద్భుతంగా నటించారు. “ఆలా ఇలా ఎలా” చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం, స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని జులై 21న భారత దేశం అంతటా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది” అని తెలిపారు.

నిర్మాత కొల్లకుంట నాగరాజు మాట్లాడుతూ “నేను పుట్టి పెరిగిన ఊరు హిందూపూర్, మన హిందూపూర్ అని రంగాల్లోనూ ముందు ఉండాలి అని కోరుకునేవాడిని. ఇప్పుడు నేను నిర్మాతగా మారి “ఆలా ఇలా ఎలా” చిత్రాన్ని నిర్మించాను, ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హిందూపూర్ లో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని జులై 21న విడుదల చేస్తున్నాం. మీరు అందరు చూసి మా చిత్రాన్ని విజయవంతం చేయాలి” అని కోరుకున్నారు.

యువ నటుడు అశోక్ మాట్లాడుతూ “ఆడియో విడుదల వేడుక ఇంత ఘనవిజయం అవుతుంది అని నేను అనుకోలేదు, హిందూపూర్ ప్రేక్షలులందరికి నా ధన్యవాదాలు. మా హీరో శక్తి గారి నటన అద్భుతంగా ఉంటుంది. మణిశర్మ గారి సంగీతం హై లైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని జులై 21న భారత దేశం అంతటా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది. మీరు అందరు మా చిత్రాన్ని సపోర్ట్ చేయాలి. మన నిర్మాత నాగరాజు గారి రెండో చిత్రంలో నేను హీరో గా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి ధన్యవాదాలు” అని తెలిపారు.

హీరో శక్తి వాసుదేవన్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేను హీరో గా కనిపిస్తాను, 83 రోజులు మంచి మంచి లొకేషన్స్ లో చిత్రీకరించాం. మా దర్శకుడు ఏ చిత్రానికి బలం, తన కథ, కథనం గొప్పగా ఉంటుంది. నిర్మాత నాగరాజు గారికి నా ధన్యవాదాలు. తెలుగు లో లాంచ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగుంటుంది, జులై 21న విడుదల అవుతుంది. అందరు చుడండి” అని తెలిపారు.

చిత్రం పేరు : ఆలా ఇలా ఎలా

నటి నటులు : శక్తి వాసుదేవన్, రాజా శేఖర్, పూర్ణ, షియాజీ షిండే, నాగబాబు, రియాజ్ ఖాన్, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి, హరిప్రియ, సితార, రేఖ, సీత, తదితరులు

యాక్షన్ డైరెక్టర్ : రాజశేఖర్

డాన్స్ మాస్టర్ : శోభి, అశోక్ రాజ్, నిక్సన్, గిరి, దిన

ఎడిటర్ : జాషి ఖ్మెర్

కెమెరా మాన్ : పి కె హెహ్ దాస్

సంగీతం : మణిశర్మ

నిర్మాత : కొల్లకుంట నాగరాజు

దర్శకుడు : రాఘవ

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News