‘ఎర్రచీర’ట్రైలర్‌లోని షాట్‌ను అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ సినిమాలో కాపీ కొట్టారు: దర్శకుడు సుమన్ బాబు

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా విడుదలకు సమీపిస్తున్న సందర్భంగా దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు ప్రింట్, వెబ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఎర్రచీర – ది బిగినింగ్ ఒక విలక్షణమైన కథాంశంతో రూపొందిన సినిమా. మదర్ సెంటిమెంట్‌కు హారర్, యాక్షన్ అంశాలు బలంగా మిళితమయ్యాయి” అని తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన డిస్ట్రిబ్యూటర్లు, సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా కంటెంట్‌పై ప్రశంసలు కురిపించారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని సెన్సార్ టీమ్ అభిప్రాయపడినట్లు తెలిపారు. సినిమా విడుదలకు కొంత ఆలస్యమైనప్పటికీ, చూసిన ప్రతి ఒక్కరూ కంటెంట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారని, ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించామని దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ..‘‘’ఎర్రచీర’ అనేది ఒక హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ చిత్రం. చింతల్ ప్రాంతంలో నా స్నేహితుడి ఇంటి పక్కన జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తీసుకున్నా. షూటింగ్ 37 రోజుల్లో పూర్తయినప్పటికీ, సీజీ వర్క్ కారణంగా సినిమా ఆలస్యమైంది. గ్రాఫిక్స్ అవుట్‌పుట్ సంతృప్తికరంగా రాకపోవడంతో మూడు చోట్ల చేయించాల్సి వచ్చింది. ‘హనుమాన్’ సినిమా రేంజ్ క్వాలిటీ కోసం ప్రయత్నించాం. అందుకే లేట్ అయింది. ఈ కథకు తెలుగు అమ్మాయి అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, కారుణ్య చౌదరిని ఎంపిక చేశా. ఆమె పాత్రలో సస్పెన్స్ ఉంటుంది. ఆమె చాలా బాగా నటించింది. ఈ సినిమాలో శ్రీరామ్, కమల్ కామరాజు, అజయ్, అయ్యప్ప పి. శర్మ, సుమన్ శెట్టి, జీవా, సత్యకృష్ణ, అన్నపూర్ణమ్మ, సురేష్ కొండేటి, రఘుబాబు వంటి దాదాపు 23 మంది ప్రముఖ నటులు ఉన్నారు. ఇందులో కేవలం 20% మాత్రమే వాస్తవ కథ ఉంటుంది, మిగిలినది కల్పితం. బాబాల గురించి కూడా ఇందులో చూపించా. ఇది రెగ్యులర్ హారర్ సినిమా కాదు. మదర్ సెంటిమెంట్, యాక్షన్ ఉన్న డిఫరెంట్ కంటెంట్. అందుకే పోటీ గురించి భయం లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం బి, సి సెంటర్ల థియేటర్లలో ప్రతి షోకి లక్కీ డ్రా తీసి 10 మందికి చీరలను బహుమతిగా ఇవ్వబోతున్నాం. అక్షయ్ కుమార్ సినిమా ‘భూత్ బంగ్లా’లో పాప పాలు తాగే షాట్‌ను మా సినిమా నుండే కాపీ కొట్టారు. యూత్ కోసం, కమర్షియల్ హంగుల కోసం 36 ముద్దుల కాన్సెప్ట్‌తో ఒక పాటను పెట్టాం. అది కథ డిమాండ్ మేరకే పెట్టాం. ఎర్రచీరకు సీక్వెల్‌గా అరకులో జరిగిన గిరిజన యదార్థ గాధతో ‘అంబిక (ఎర్రచీర-2)’ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నా. అలాగే ‘రాముడా? కృష్ణుడా?’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తున్నా. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నా.’’ అని తెలిపారు.

నటీనటులు – బేబీ సాయి తేజస్విని, క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు, జీవా, తదితరులు

టెక్నికల్ టీమ్:
ఆర్ట్ – నాని, సుభాష్
స్టంట్స్ – నందు,
డైలాగ్స్ – గోపి విమల పుత్ర,
సినిమాటోగ్రఫీ – చందు
ఎడిటర్ – వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి,
రాజ మోహన్
బీజీఎం – ఎస్ చిన్న
మ్యూజిక్ – ప్రమోద్ పులిగార్ల
సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్
పిఆర్ఓ – సురేష్ కొండేటి
సమర్పణ – బేబీ డమరి ప్రజెంట్స్
నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్. వెంకట సుమన్
కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం – క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు.

TFJA

Recent Posts

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…

2 days ago

ఫ్రెండ్లీ ఘోస్ట్ టీజర్ విడుదల !!!

ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…

3 days ago

ఘనంగా ‘శివ గాడి జింద‌గీ’ మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జింద‌గీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…

3 days ago

హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) “ది మేజ్” చిత్రంతో దర్శకుడిగా ప్రతిభ చాటనున్న డా. రవికిరణ్ గడలాయ్

ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…

3 days ago

‘అగధ’ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా చాలా అద్భుతంగా ఉంటుంది – హీరో శ్రవణ్ రెడ్డి

ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…

3 days ago

పాతబస్తీ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం ఎత్తిన సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…

3 days ago