టాలీవుడ్

సంక్రాంతికి వస్తున్నాం’లో భాగ్యం లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకూ చేయలేదు ఐశ్వర్య రాజేష్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేకరుల సమావేశంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ విశేషాల్ని పంచుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ లో ఎలా వచ్చారు ? ఈ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?
-సుడల్ వెబ్ సిరిస్ షూటింగ్ లో వున్నప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్ కి లుక్ టెస్ట్ చేయాలని అన్నారు. నేను చాలా సర్ ప్రైజ్ అయ్యాను. ఆయన సినిమాలన్నీ చూశాను. ఇందులో నా క్యారెక్టర్ కి ఒక యాస వుంది. ఆ యాసతో పాటు ఆ లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ డైలాగ్ ఇచ్చారు. రెండు లైన్స్ చెప్పగానే చాలని చెప్పి స్క్రిప్ట్ ని నరేట్ చేశారు. నరేషన్ లో పడిపడి నవ్వుకున్నాను. నా కెరీర్ లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ ఇదే. భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెదికారు. ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా వుంది.

-ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను.’సంక్రాంతికి వస్తున్నాం’ నాకు చాలా స్పెషల్. గోదారి గట్టు పాట అందరికీ రీచ్ అయ్యింది. నేను ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే ప్రతి ఒక్కరూ నాతో ఫోటో తీసుకుంటున్నారు. అది ఆ పాటకి వచ్చిన రీచ్. ఆ సాంగ్ ఒక వైల్డ్ ఫైర్ లా పాకింది.

-తెలుగులో నాకు ఇప్పటివరకూ సరైన డ్యూయెట్ సాంగ్ పడలేదు. ఆ లోటు గోదారి గట్టు పాటతో తీరింది. వెంకటేష్ గారు లాంటి బిగ్ హీరోతో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడం అది ఇంత వైరల్ హిట్ కావడం ఆనందంగా వుంది. అలాగే సినిమాలో పాటన్నీ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పాటలు హిట్ అయితే సగం పాసైపోయినట్లే. ట్రైలర్ ఆ అంచనాలని మరింతగా పెంచింది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా.

వెంకటేష్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ?
-బిగినింగ్ లో చాలా భయం వేసింది. ఎందుకంటే భాగ్యం.. మామూలు క్యారెక్టర్ కాదు. కత్తిమీద సాములాంటి క్యారెక్టర్. కొంచెం బ్యాలెన్స్ తప్పినా కష్టమే. ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆడియన్స్ చుస్తున్నప్పుడు జాలి పుట్టే క్యారెక్టర్. చాలా క్రూసియాల్ రోల్. కాస్త శ్రుతిమించిన ఓవర్ డోస్ అయిపోతుంది. భాగ్యం పాత్రని అర్ధం చేసుకోవడానికి నాకు పదిరోజులు పట్టింది.

-వెంకీ గారు ఎమోషన్స్ అన్నీ నేచురల్ గా వుంటాయి. ఆయన టైమింగ్ అద్భుతం. ఆయనతో కలసి యాక్ట్ చేయడం మామూలు విషయం కాదు. అయితే ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. భాగ్యం క్యారెక్టర్ లో అదరగొడుతున్నావ్ అని మెచ్చుకునే వారు. కానీ డైలాగులు ఇచ్చేటప్పుడు టెన్షన్ వచ్చేసేది. చేతులు వణికేవి. ఒకసారి ఫీవర్ కూడా వచ్చింది(నవ్వుతూ). వెంకీ గారు, అనిల్ గారి సపోర్ట్ మర్చిపోలేను. వెంకీ గారు చాలా పాజిటివ్ గా వుంటారు. వండర్ ఫుల్ పర్శన్.

-భాగ్యం లాంటి క్యారెక్టర్ ఐదారేళ్ళుగా తెలుగు సినిమాల్లో చూడలేదు. చాలా ఫ్రెష్ రోల్. ఇలాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమా వచ్చి చాలా రోజులైయింది. అందరూ కనెక్ట్ చేసుకునే సినిమా ఇది. అనిల్ గారు చాలా క్రియేటివ్ గా ఈ కథని చెప్పారు.

మీనాక్షి చౌదరితో యాక్ట్ చేయడం గురించి ?
-మీనాక్షి చాలా సింపుల్. తనకి నాకు దగ్గర పోలికలు. డాక్టర్ చదువుకుంది. కష్టపడి పైకి వచ్చింది. తను చాలా స్వీట్. తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మీను సాంగ్ లో తప్పితే.. వెంకటేష్ గారు నేను మీనాక్షి .. ముగ్గురూ సినిమా అంతా ట్రావెల్ అవుతాం. మా ముగ్గురిని చూడాల్సిందే. ఇందులో వెంకీ గారిది మా ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్.

దిల్ రాజు గారి నిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది ?
-దిల్ రాజు, శిరీష్ గారి బ్యానర్ లో వర్క్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్.

మీ కథల ఎంపిక ఎలా వుంటుంది ?
-సినిమాలో చేసే అవకాశం అందరికీ రాదు. అదొక అదృష్టం. భిన్నమైన కథలు చెప్పడానికి సినిమా గొప్ప వేదిక. నా వరకూ డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఏ పాత్ర చేసినా సోషల్ రెస్పాన్స్ బిలిలిటీ వుండాలని కోరుకుంటాను.

Tfja Team

Recent Posts

DUDE First Single DoingHal chal on Social Media!!

Trending inTelugu & Kannada The song from the upcoming bilingual film "Dude" is going viral…

30 minutes ago

సోషల్ మీడియాలో వైరల్అవుతున్న “డ్యూడ్” సాంగ్

తెలుగులో ట్రెండింగ్….కన్నడలో సూపర్ హిట్ "ఏమిటో మాయ మంత్రమేమది జింకలా పరిగెత్తేనే…." యువ ప్రతిభాశాలి తేజ్ నటిస్తూ కన్నడ-తెలుగు భాషల్లో…

32 minutes ago

I Am Super Confident in Daaku Maharaaj Shraddha Srinath

Q: You’ve been in the industry for over a decade, working with multiple stars across…

19 hours ago

డాకు మహారాజ్’ సినిమా ఒక పూర్తి ప్యాకేజ్ లా ఉంటుంది కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్

నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న…

19 hours ago

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైటిల్ హైందవ- గూస్‌బంప్స్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అకల్ట్ థ్రిల్లర్ #BSS12, డెబ్యుటెంట్ డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని…

19 hours ago

నేడే మెగా స్టార్ దర్శకుడు వశిష్ట పుట్టిన రోజు

ఈరోజు బింబిసార, విశ్వంభర చిత్ర దర్శకుడు వశిష్ట పుట్టినరోజు చాలా తక్కువ మందికి మాత్రమే సినిమాలంటే పిచ్చి ఉంటుంది.. అలాంటి…

20 hours ago