పాన్ ఇండియా చిత్రం ‘అహో! విక్రమార్క’ ట్రైల‌ర్ విడుద‌ల‌

బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ఆయ‌న హీరోగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘అహో! విక్రమార్క’. ఆగ‌స్ట్ 30న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అసుర అనే విల‌న్ ఓ ప్రాంతాన్ని త‌న కంట్రోల్‌లో పెట్టుకుని ఉంటాడు. అక్క‌డి ప్ర‌జ‌లు అత‌ను చెప్పింది వినాల్సిందే. లేకుంటే వారికి చావే గ‌తి. అలాంటి వాడిని ఎదిరించ‌టానికి పోలీసుల‌కే గుండె ధైర్యం ఉండ‌దు. కానీ చెడుని అంత మొందించ‌టానికి మంచి ఏదో ఒక రూపంలో వ‌స్తుంది. అలాంటి అసురుడిని అంతమొందించ‌టానికి ఆ ప్రాంతంలోకి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ వ‌స్తాడు. త‌నేం చేశాడు.. ఎలా విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్టాడు.. అనేది తెలుసుకోవాలంటే ఆగ‌స్ట్ 30న విడుద‌ల‌వుతున్న సినిమా చూడాల్సిందే.

ఈ సంద‌ర్భంగా దేవ్ గిల్ మాట్లాడుతూ ‘‘ ‘అహో! విక్రమార్క’తో, మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆగస్ట్ 30న సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నాలోని న‌టుడిని ఓ కోణంలో చూసిన ప్రేక్ష‌కులు మ‌రో కోణాన్ని వెండితెర‌పై చూస్తారు ” అని పేర్కొన్నారు.

దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ ‘‘అహో! విక్రమార్క’ ద్వారా, భాష, సంస్కృతులను, వీరత్వం, త్యాగం సారాంశాన్ని చిత్రీకరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. పోలీసుల పవర్‌ను తెలియ‌జేసేలా సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం రూపొందించాం. సరికొత్త దేవ్ గిల్‌ను చూస్తారు ’’ అని అన్నారు.

న‌టీన‌టులు:

దేవ్ గిల్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago