తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో ఆహా ఓటీటీ మూవీస్ సత్తా చాటాయి. పలు మేజర్ కేటగిరీల్లో ఆహా మూవీస్ అవార్డ్స్ గెల్చుకున్నాయి. సెకండ్ బెస్ట్ ఫిలింగా పొట్టేల్, బెస్ట్ చిల్డ్రన్ ఫిలింగా 35 ఇది చిన్న కథ కాదు అవార్డ్స్ దక్కించుకున్నాయి. 35 ఇది చిన్న కథ కాదు మూవీలో నటనకు నివేదా థామస్ కు బెస్ట్ హీరోయిన్ గా, అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రంలో నటనకు ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్, రజాకార్ మూవీకి మంచి సంగీతాన్ని అందించిన భీమ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్స్ గెల్చుకున్నారు.
35 ఇది చిన్న కథ కాదులో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, మెర్సీ కిల్లింగ్ లో నటించిన బేబి హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా గద్దర్ అవార్డ్స్ కు ఎంపికయ్యారు. రాజు యాదవ్ సినిమాకు బెస్ట్ లిరిసిస్ట్ గా చంద్రబోస్, రజాకార్ మూవీకి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా నల్ల శ్రీను గద్దర్ అవార్డ్స్ దక్కించుకున్నారు. పొట్టేల్ మూవీలో నటనకు అనన్య నాగళ్ల, రాజు యాదవ్ మూవీకి నిర్మాతలుగా ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ గెల్చుకున్నారు. తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలకు ప్రధాన విభాగాల్లో గద్దర్ అవార్డ్స్ దక్కడంపై ఆహా టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.ఆహా ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు, సిరీస్లు, షోలను అందించడంతో పాటు, ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని సాంస్కృతిక వైభవాన్ని చాటే కంటెంట్ ని అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆహా టీమ్ తెలిపింది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…