తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. అన్ని జానర్స్ లో ఫ్రెష్ స్టోరీస్ తో ఒరిజినల్స్, మూవీస్, గేమ్ షోస్ తో వినోదాన్ని పంచుతోంది. గత నవంబర్ లో రాజ్ తరుణ్ నటించిన “చిరంజీవ” సినిమాను స్ట్రీమింగ్ చేసిన ఆహా, కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ కె ర్యాంప్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అలాగే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 5 కూడా అలరించింది.
డిసెంబర్ లో ఫస్ట్ ద్విభాషా ఒరిజినల్ సిరీస్ ధూల్ పేట పోలీస్ స్టేషన్ ను ఆహా స్ట్రీమింగ్ చేయగా, ఆ తర్వాత 3 రోజెస్ సీజన్ 2ను అందించింది. ఈ కొత్త ఏడాది జనవరిలో ఆది సాయికుమార్ సూపర్ హిట్ మూవీ శంబాల, శివకార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ సినిమా అయలాన్, ఆది పినిశెట్టి క్రైమ్ థ్రిల్లర్ డ్రైవ్ సినిమాలను సబ్ స్క్రైబర్స్ ఆహా వేదికగా ఎంజాయ్ చేశారు. ఫిబ్రవరి 4న నందు హీరోగా నటించిన సైక్ సిద్ధార్థ్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

ఇలా కొత్త మూవీస్, షోస్ ను ప్రతివారం లాంఛ్ చేస్తూ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ను తన సబ్ స్రైబర్స్ కు అందిస్తోంది ఆహా ఓటీటీ. ఆహాలో త్వరలో ఇంకా మరెన్నో ఎగ్జైటింగ్ మూవీస్, షోస్, ఒరిజినల్స్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి.

