మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం ఫిబ్రవరి 14న వచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత డా.బ్రహ్మానందం మాట్లాడుతూ..‘బ్రహ్మా ఆనందం సినిమాను చూసిన వారంతా మా అబ్బాయి గురించే మాట్లాడుతున్నారు. మీ కన్నా.. మీ అబ్బాయి బాగా చేశాడని మెచ్చుకుంటూ ఉంటే తండ్రిగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొత్త పాత్రలను చేయాలనే ఎప్పుడూ కోరుకుంటాను. నన్ను అభిమానించే ఆడియెన్స్‌కు ఏదైనా కొత్తగా అనిపించాలనే ఉద్దేశంలోనే సినిమాను చేస్తుంటాను. చాలా కాలం తరువాత ఓ మంచి సినిమాను, మంచి పాత్రను చేశాననే సంతృప్తి కలిగింది. ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించే గొప్ప అంశాలేమీ ఇందులో లేవు. నేను, వెన్నెల కిషోర్, స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్, నా కొడుకు రాజా గౌతమ్‌లు మాత్రమే ఉన్నారు. ‘మీరు చాలా రోజుల తరువాత కనిపిస్తున్నారు కదా? అందుకే థియేటర్లకు జనాలు వస్తున్నారు’ అని చాలా మంది చెబుతుంటే ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు కాకుండా రంగమార్తాండ లాంటి కారెక్టర్లు చేయాలని అనుకుంటున్నాను. డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి. నా మీద ప్రేమతో యంగ్ దర్శకులు వచ్చి.. ఒక్క రోజు పాత్ర ఉంది.. చేయండి సర్ అని అడుగుతుంటారు. అలా చేయడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా?.. నేను ఆ పాత్ర చేస్తే వాళ్లకి ఉపయోగపడుతుంది కదా? అని నేను చిన్న పాత్రల్ని అయినా చేస్తున్నాను. నా కోసం ఇంత మంది థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తున్నారు అని తెలిసి ఎంతో ఆనందమేస్తోంది’ అని అన్నారు.
హీరో రాజా గౌతమ్ మాట్లాడుతూ.. ‘బ్రహ్మా ఆనందం సినిమాను చూసిన వారంతా నా గురించి మాట్లాడుతున్నారు. మా నాన్న ఇంట్లోనూ నాతో పాటు సరదాగా ఉంటారు. స్క్రీన్ మీదకు వచ్చే సరికి మాత్రం చాలా సీరియస్‌గా ఉండేది. మా నాన్న ఎప్పుడూ కూడా మా మీద ఒత్తిడి పెంచలేదు. అలా ఎందుకు చేశావ్.. ఇలా ఎందుకు చేశావ్ అని కాకుండా.. అన్నీ మా నిర్ణయాలకే ఆయన వదిలేస్తుంటారు. మళ్లీ ఇప్పుడు రాహుల్ గారితోనే ఓ సినిమాను చేస్తున్నాను. వైబ్ సినిమాలో మరింత కొత్తగా కనిపిస్తాను. మను తరువాత ధూత చేశాను. ఆ తరువాత బ్రేక్ అవుట్ చేశాను. మళ్లీ ఇప్పుడు ఈ మూవీని చేశాను. కంటిన్యూ పని అయితే చేస్తూనే ఉన్నాను. నేను పెట్టే ఎఫర్ట్స్‌ను మాత్రం నాన్న గారు గమనిస్తూనే ఉంటారు’ అని అన్నారు.
నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘నేను నిర్మించిన గత చిత్రాలు మంచి మౌత్ టాక్‌తోనే హిట్ అయ్యాయి. ఈ మూవీకి మంచి మౌత్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు అన్ని చోట్లా షోలు ఫుల్ అవుతున్నాయి. మీడియా సహకారంతో ఇంకా ముందు వెళ్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ఆర్.వి.సి.నిఖిల్ మాట్లాడుతూ.. ‘బ్రహ్మా ఆనందం విషయంలో అందరూ హ్యాపీగా ఉన్నారు. థియేటర్‌కు వెళ్లి ఆడియెన్స్‌తో కలిసి సినిమాను చూశాం. మేం ఊహించని సీన్లలో కూడా నవ్వుతున్నారు. రీ రిలీజ్‌ల వల్ల మా సినిమాపై పెద్ద ప్రభావం చూపించలేదనిపిస్తోంది’ అని అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…