‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ నాకు మరో బ్లాక్ బస్టర్

‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ నాకు మరో బ్లాక్ బస్టర్: రంగబలి సక్సెస్ మీట్ లో హీరో నాగశౌర్య

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన  ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటించారు. జూలై 7న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ‘భలే’ ఎంటర్ టైనర్ గా నిలిచి బ్లాక్ బ్లాక్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. రంగబలి చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. పవన్ చాలా మంచి సినిమా తీశారు. చాలా మంచి కథ చెప్పారు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ‘ఛలో’ తర్వాత నాకు రంగబలి మరో బ్లాక్ బస్టర్. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన నిర్మాత సుధాకర్ గారికి. టీం అందరికీ కృతజ్ఞతలు. యుక్తి చక్కగా నటించింది. చాలా మందికి నచ్చింది. సత్య, జాకెట్ (రాజ్ కుమార్ ) ఇద్దరూ చక్కగా ఎంటర్ టైన్ చేశారు. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు

దర్శకుడు పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ..రంగబలి చిత్రాన్ని ప్రేక్షకులు అన్ని చోట్ల ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు పడిపడి నవ్వుతున్నారు. ఫస్ట్ హాఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. శౌర్య అన్న, సత్య, రాజ్ కుమార్ పాత్రలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో ఒక మంచి కథ, సందేశాన్ని చెప్పాం. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్స్ బాగున్నాయి. నాగశౌర్య అన్నకి, నిర్మాత సుధాకర్ గారికి కృతజ్ఞతలు. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు.

యుక్తి తరేజ మాట్లాడుతూ..ఇది నా మొదటి తెలుగు సినిమా. సినిమాని ప్రేక్షకులు   ఎంతగానో ఆదరిస్తున్నారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి”అన్నారు

రాజ్ కుమార్ మాట్లాడుతూ.. రంగబలి అందరికీ నచ్చింది. సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడనివారు ఉంటే ఖచ్చితంగా చూడండి ఇది ఒక ఊరు ఎమోషన్. అందరికీ కనెక్ట్ అవుతుంది” అన్నారు.Pro: Vamsi – Shekar

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

14 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago