అడివి శేష్  పాన్ ఇండియా మూవీ G2 ఫస్ట్ లుక్ & ప్రీ-విజన్ విడుదల

HIT2తో డబుల్ హ్యాట్రిక్ హిట్‌ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2ని అనౌన్స్ చేశారు. గూఢాచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు.

“మేజర్”ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్,  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌ లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాట “ప్రీ విజన్” వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఫార్మల్ అవుట్ ఫిట్ లో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్‌ లో ఉన్న శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అడివి శేష్  మేకోవర్‌ అయ్యారు.

ప్రీ-విజన్ విషయానికి వస్తే,  శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో అతని ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 2023లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని అనౌన్స్ చేశారు. కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాలు, ఇంటర్నేషనల్ టీం పరంగా  G2 అద్భుతంగా ఉంటుంది. పోస్టర్,  ప్రీ-విజన్‌ లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

తారాగణం: అడివి శేష్

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: వినయ్ కుమార్ సిరిగినీడి

కథ: అడివి శేష్

నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్

బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago