ప్రేక్షకులు ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిత్య ఓం ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బంధీ అనే సినిమా రిలీజ్‌కు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
సింగిల్ క్యారెక్టర్‌తో బంధీ అనే చిత్రాన్ని చేశారు ఆదిత్య ఓం. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మించగా.. తిరుమల రఘు దర్శకత్వం వహించారు. పర్యావరణ సంరక్షణ, ప్రకృతి గొప్పదనం చాటి చెప్పేలా ఈ మూవీ ఉండబోతోంది. ఇది వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు, ట్రైలర్ సినిమాలోని డెప్త్‌ను చాటాయి. ఇక ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది.
నేచురల్ లొకేషన్స్‌లో ఈ మూవీని షూట్ చేశారు. దేశంలోని వివిద అటవీ ప్రాంతాల్లో కష్టాలు పడుతూ, ఎటు వంటి డూప్స్ లేకుండా ఆదిత్య ఓం చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. ప్రకృతిని నాశనం చేస్తున్న మానవాళికి ఓ కనువిప్పులా ఈ చిత్రం ఉండబోతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు మేకర్లు తీసుకు రానున్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…