సెన్సార్ పూర్తి చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘గాండీవధారి అర్జున’
వైవిధ్యమైన జోనర్స్ కథాంశాలతో సినిమాలు చేయటానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఈ టాలీవుడ్ స్టార్ ప్రతీ సినిమాకు తన విలక్షణతను చూపిస్తూనే వస్తున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు సినిమాను తెరకెక్కించారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌లో గూజ్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25న గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్, సాంగ్ రిలీజ్ తర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.
తాజాగా ‘గాండీవధారి అర్జున’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 18 నిమిషాలుగా మేకర్స్ ఈ సినిమా రన్‌టైమ్‌ను లాక్ చేశారు. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు సినిమాలోని మంచి మెసేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. నాజర్, విమలా రామన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నటీనటులు నటన, సాంకేతిక నిపుణుల ప్రతిభ ప్రేక్షకులకు ఓ అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. యూనిక్ స్టోరీలతో సినిమాలను డైరెక్ట్ చేసే బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు తనదైన పంథాలో ‘గాండీవధారి అర్జున’ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గానే కాకుండా ప్రేక్షకులకు మంచి ప్రభావాన్ని చూపేలా తెరకెక్కించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నిర్మాణ సంస్థ చేసే సినిమాల్లోని ప్రొడక్షన్ వేల్యూస్ గొప్పగా ఉండటమే కాకుండా ప్రేక్షకులకు ఓ గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఉంటాయి. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాకు ముఖేష్ సినిమాటోగ్రాపర్‌గా అవినాస్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ‘గాండీవధారి అర్జున’ ఆగస్ట్ 25న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…