నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజయభాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జిలేబి హిలేరియస్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ అని టీజర్ భరోసా ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆకు పాకు’ అనే పాటని విడుదల చేశారు మేకర్స్. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ పాటని క్యాచి నెంబర్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ గా పాడిన ఈ పాటలో లీడ్ పెయిర్ కంగారు పడుతూ పరుగులు తీయడం థ్రిల్లింగ్ గా వుంది.
ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ కాగ, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: శ్రీకమల్, శివాని రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు.
సాంకేతిక విభాగం:
దర్శకత్వం : కె. విజయభాస్కర్
నిర్మాత: గుంటూరు రామకృష్ణ
బ్యానర్ : ఎస్ఆర్కే ఆర్ట్స్
సమర్పణ : అంజు అశ్రాని
సంగీతం: మణిశర్మ
డీవోపీ: సతీష్ ముత్యాల
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ
పీఆర్వో : వంశీ శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…