ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ ట్రైలర్ రిలీజ్

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న  యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో.తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘క్రేజీ ఫెలో’ టైటిల్ కి తగ్గట్టే ట్రైలర్ చాలా క్రేజీగా వుంది. ఫ్యామిలీ, ఫన్, రోమాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ తో క్యూరియాసిటీని పెంచింది ట్రైలర్.  ‘మావాడు చాలా మారిపోయాడు. ఇంతకుముందులా లేడు’అని అనీష్ కురువిల్లా, సప్తగిరికి చెప్పిన తర్వాత.. డాక్టర్ సమరానికి ఎవరో రాసిన ఉత్తరం చదువుతూ ఆది పాత్ర రివిల్ కావడం చాలా క్రేజీగా వుంది. తర్వాత ఫ్రండ్స్, ఆఫీస్ లో వచ్చిన కొన్ని సీన్స్ కంప్లీట్ ఫన్ ని పంచాయి. ట్రైలర్ లో బాలత్రిపుర సుందరి పాట ఆకట్టుకుంది.

తర్వాత వచ్చిన యాక్షన్, ఎమోషనల్ సీన్స్ క్రేజీ ఫెలో కథపై ఆసక్తిని పెంచాయి. ఇక ట్రైలర్ చివర్లో ‘పుణ్యానికి పొతే పాప ఎదురైయింది” అని ఆది చెప్పిన డైలాగ్ హిలేరియస్ గా వుంది.ట్రైలర్ లో ఆది తన స్టయిలీష్ లుక్స్, యాక్షన్ తో అలరించాడు. ఆది కామిక్ టైమింగ్ ఎక్సటార్డినరీగా వుంది . హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ అందంగా కనిపించారు. సతీష్ ముత్యాల కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఆర్ఆర్ ధృవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్ గా ఉన్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా, ట్రైలర్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.ఈ చిత్రానికి సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు.  అక్టోబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా ప్రకటించారు నిర్మాతలు.

తారాగణం: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశి,  మర్నా మీనన్

సాంకేతిక విభాగం:
సమర్పణ:  లక్ష్మీ రాధామోహన్  
బ్యానర్ : శ్రీ సత్య సాయి ఆర్ట్స్
నిర్మాత : కేకే రాధమోహన్
రచన, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి
సంగీతం : ఆర్ఆర్ ద్రువన్
డీవోపీ: సతీష్ ముత్యాల
ఆర్ట్ : కొలికపోగు రమేష్
ఎడిటర్: సత్య గిడుతూరి
యాక్షన్: రామ కృష్ణ
కొరియోగ్రఫీ: జిత్తు, హరీష్
ప్రొడక్షన్ కంట్రోలర్: యంఎస్  కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను)
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజైనర్ : రమేష్ కొత్తపల్లి

Tfja Team

Recent Posts

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన “రాక్షసుడు” నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…

10 hours ago

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ

హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…

12 hours ago

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago