ఇంట్రెస్టింగ్‌గా ఆది సాయి కుమార్ ‘శంబాల’ న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్

విభిన్న చిత్రాలతో ప్రయోగాలు చేస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం శంబాల అంటూ కొత్త ప్రపంచంలోకి ఆడియెన్స్‌‌ను తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్‌ అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి A (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు.

ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా వదిలిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఆది సాయి కుమార్ ఇంటెన్స్ లుక్, వింటేజ్ మేకోవర్ అదిరిపోయింది. ఇక న్యూ ఇయర్ స్పెషల్‌గా వదిలిన కొత్త పోస్టర్ శంబాల మీద మరింతగా ఆసక్తి పెంచేలా ఉంది. ఈ పోస్టర్‌లో చూపించిన ఆ పొలం.. ఆ దిష్టి బొమ్మ.. ఆకాశం నుంచి భూమ్మీదకు వస్తున్న అగ్ని కణం ఇలా అన్నీ కూడా కథ మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి.

ఆది సాయి కుమార్, అర్చన అయ్యార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య45లో కీలక పాత్ర పోషించిన లబ్బర్ పందు ఫేమ్ స్వాసిక ఇంపార్టెంట్ కారెక్టర్‌ను పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ వంటి ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

హన్స్ జిమ్మర్ వంటి హాలీవుడ్ వ్యక్తులతో కలిసి పనిచేసిన ప్రతిభావంతులైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో శరవేంగా చిత్రీకరణ జరుపుకుంటోంది శంబాల.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

11 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

11 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago