ఆది “సీఎస్ఐ సనాతన్” గ్లింప్స్ విడుదల

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా
“సీఎస్ఐ సనాతన్”. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ)
ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు
రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా
రూపొందుతున్న “సీఎస్ఐ సనాతన్” సినిమా గ్లింప్స్ ను తాజాగా
విడుదల చేశారు.

ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ మూడ్ లో కనిపించారు. క్రైమ్ సీన్ లో దొరికిన ప్రతి చిన్న అంశాన్నీ రిపోర్టులో చేరుస్తూ నివేదిక తయారు చేస్తున్నారు. ఎలాంటి నేరాన్నయినా చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ పాత్ర రూపొందింది. ఈ క్లూస్ తో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇప్పటిదాకా రాని సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. హత్య కేసు విచారణ సాగే క్రమం అంతా ఆద్యంతం ఆసక్తిని పంచనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబర్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

న‌టీ న‌టులు – ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్,
తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్, వసంతి తదితరులు

సాంకేతిక వ‌ర్గం – ,
సినిమాటోగ్ర‌ఫీ ః జిశేఖ‌ర్,
మ్యూజిక్: అనీష్ సోలోమాన్,
పిఆర్ఒ ః జియ‌స్ కె మీడియా,
నిర్మాత ః అజ‌య్ శ్రీనివాస్
ద‌ర్శ‌కుడు ః శివ‌శంక‌ర్ దేవ్

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago