అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో.. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ వంటి సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరొందిన సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా ప్యాండమిక్ తరువాత రీ రిలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్‌లో కనపడుతోంది. నిజమే ఒక కాఫీ షాప్‌లో ఇన్ని జరుగుతూ ఉంటాయి కాబోలు అని అర్థమైంది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ట్రైలర్ కనిపిస్తోంది. నేను చాలా ఎంజాయ్ చేశాను.

ఈ ట్రైలర్ చూశాక నాకు ఆర్.పి గారే హీరో అనిపించింది. ఎందుకంటే.. కథే హీరో కనుక ఆ కథను మలిచింది ఆయనే కనుక. ఆర్.పి గారు ఏ క్రాఫ్ట్‌కు వెళ్ళినా సక్సెస్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.. ఎందుకంటే మేము టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆయన కంపోజ్ చేసిన పాటలే ఎక్కువగా వినే వాళ్ళం. ఆ పాటలే లేకుంటే మా టీనేజ్ అంతా ఏమైపోయేదో.. మమ్మల్ని అంత ఇంప్రెస్ చేశాయి. ఇక ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరితో నా కెరీర్ మొదటి నుంచి కలిసి ట్రావెల్ చేశాను. ఫ్రెండ్స్ మధ్య ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ.. టీమ్‌కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను..’’ అన్నారు.అతిథిగా హాజరైన నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. మొదట ఈ టైటిల్ చెప్పగానే ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ఏంటి? కాఫీ విత్ కరణ్ లాగా అని అనుకున్నా.. బట్ ట్రైలర్ చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమా ఘన విజయం సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.

దర్శకుడు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘ఓటిటి వచ్చాక జనాలకు థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్తగా చెప్తే కానీ థియేటర్స్‌కు రప్పించలేము అనిపించే ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ సినిమా కథను రాసుకొని.. డైరెక్ట్ చేయడం జరిగింది. అందుకు నా మరో తమ్ముడు సెవెన్‌హిల్స్ సతీష్ తోడై నిర్మాతగా వ్యవహరించాడు. సెట్‌లో తన ఆవేశాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే అయ్యింది( నవ్వుతూ). కానీ, సతీష్ అలా ఉండడం వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు రాగలిగింది. ఇంకో రెండు సినిమాలు మా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కాఫీ విత్ ఎ కిల్లర్ చిత్రానికి వస్తే.. ఆరిస్టులు అందరూ చాలా సపోర్ట్ చేసినా.. వారి వెంట వచ్చిన అసిస్టెంట్స్ వల్ల బాగా ఇబ్బంది పడ్డాము. అది కాకుండా అయితే ఇట్స్ ఎ టీం వర్క్ అని చెప్పాలి. ఈజీగా చేసే సినిమా మాత్రం కాదు అని చెప్పగలను. ఈ చిత్రంలో ఒక సీక్రెట్ కూడా ఉంది.. అది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రివీల్ చేస్తాము. అందుకే ఆర్టిస్టులను ఎవర్నీ ఇక్కడికి తీసుకురాలేదు. ఒక డిఫరెంట్ అండ్ న్యూ కాన్సెప్ట్‌ను ట్రై చేశాము. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ఇక మేము పిలవగానే తను ఎంతో బిజీగా ఉన్నా.. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన అనిల్ రావిపూడి‌గారికి కృతఙ్ఞతలు.. ఎందుకో ఆయనకు నేనంటే చాలా అభిమానం. అలాగే అభిషేక్ అగర్వాల్ గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.

నిర్మాత సెవెన్‌హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. ‘‘ఆర్.పి గారు నాకు సొంత బ్రదర్ లాంటి వాడు. వాళ్ళ సొంత బ్రదర్స్ తనతో పాటు ఉంటారు.. నేను బయట తనతో తిరుగుతూ ఉంటాను అంతే. ఈ సినిమా లైన్ చెప్పగానే యాక్సెప్ట్ చేయాలనుకున్నా.. ఈ సినిమాలో ఒక చిన్నసర్‌ప్రైజ్ ఉంది.. త్వరలో రివీల్ చేస్తాము. ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేసిన గౌతమ్ పట్నాయక్ కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంతదాకా వచ్చేది కాదు. ఆర్ పి గారితో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో రఘు కుంచె, జెమినీ సురేష్, బెనర్జీ, రవి ప్రకాష్, గౌతమ్ పట్నాయక్, అనుష్, తిరుమల నాగ్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ రెడ్డి, రవి బాబు, సత్యం రాజేష్, రఘు బాబు, జెమినీ సురేష్, రవి ప్రకాష్, టెంపర్ వంశీ, బెనర్జీ తదితరులు ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి
క్రియేటివ్ హెడ్: గౌతమ్ పట్నాయక్,
డి ఓ పి- ఎడిటర్- డి ఐ- అనుష్ గౌరక్,
డైలాగ్స్: తిరుమల నాగ్,
పీఆర్వో: బి. వీరబాబు,
నిర్మాత: సెవెన్ హిల్స్ సతీష్,
రైటర్- డైరెక్టర్: ఆర్ పి పట్నాయక్.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

7 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago