హరి హర వీర మల్లు’ చిత్రం నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదల

కథానాయిక నిధి అగర్వాల్‌కి ప్రత్యేక పోస్టర్‌తో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘హరి హర వీర మల్లు’ చిత్ర బృందం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సినీ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అందించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు చేయని చారిత్రాత్మక యోధుడు పాత్రలో ఆయన కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత ఆగస్టు 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం విదితమే. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

ఇక ఇప్పుడు చిత్ర బృందం మరో అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపింది. పోస్టర్‌లో నిధి మహాలక్ష్మి దేవి అవతారంగా, బంగారు చీరలో, అద్భుతంగా కనిపిస్తున్న నగలతో మెరుస్తోంది. తనదైన అందంతో ఆమె మాయ చేసేలా కనిపిస్తోంది.

అణగారిన వర్గాల కోసం పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.

యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకొని, సినీ ప్రేమికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘హరి హర వీర మల్లు’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago