విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రెండు వరుస హిట్‌లను అందించిన తర్వాత, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ హ్యాట్రిక్ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది.
ప్రస్తుతం, పొల్లాచ్చిలోని కొన్ని అందమైన ప్రదేశాలలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లు పోషించిన భార్య, భర్తలపై ఒక అందమైన పాట చిత్రీకరించారు. సంగీతంలో తో ఫారమ్‌లో ఉన్న భీమ్స్ సిసిరోలియో చార్ట్‌బస్టర్ పాటను సంగీతం అందించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని సమకూర్చారు. డ్యాన్స్ కొరియోగ్రఫీని భాను మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. భార్యాభర్తల ప్రేమను తెలిపే ఉత్తమ పాటల్లో ఇది ఒకటి కానుంది.
ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మరో నాయికగా నటిస్తోంది. ఈ త్రికోణ క్రైమ్ డ్రామాలో అతని మాజీ ప్రేయసిగా ఆమె కనిపించనుంది.
ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. ఎడిటింగ్ తమ్మిరాజు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లేకు సహకరించారు. వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధం కానుంది.
తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, మరియు చిట్టి
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
సహ రచయితలు: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
PRO: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…