టాలీవుడ్

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు.. బ్లాక్ బస్టర్ ఫన్ షోలో హీరో తిరువీర్

విజయోత్సవ వేడుకలో టీఎఫ్‌జేఏకి ఆర్థిక విరాళం అందించిన నిర్మాత సందీప్ అగరం

వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు బ్లాక్ బస్టర్ ఫన్ షోని చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు, రచయిత, నటుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అనేది మీడియా సినిమా. చిన్న చిత్రాలు బతకాలి అని అంతా అంటుంటారు. మంచి చిత్రాన్ని అందరూ ముందుండి నడిపిస్తుంటారు. పెద్ద బ్యానర్స్ చిన్న చిత్రాల్ని సులభంగానే రిలీజ్ చేస్తారు. కానీ కొత్త, చిన్న నిర్మాతలు తీసే చిన్న సినిమాల్ని రిలీజ్ చేయడం కష్టం. ఇలా అభిరుచి ఉన్న నిర్మాతల్ని ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. చిన్న చిత్రాలు ఆడితే కొత్త హీరోలు, దర్శకులకు అవకాశాలు వస్తాయి. తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ అందరూ అద్బుతంగా చేశారు. తిరువీర్‌ ఎంతో క్రమశిక్షణ ఉన్న నటుడు. ఎన్నో కష్టాలు పడి ఇంత స్థాయికి వచ్చాడు. సినిమాకు వెళ్లినట్టుగా కాకుండా.. ఊర్లోకి వెళ్లినట్టు చూసినట్టుగా ఉంటుంది. ‘బలగం’ తరువాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. ఈ మూవీకి చాలా అవార్డులు వస్తాయి. సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీత దర్శకుడు. తన మ్యూజిక్‌తో సురేష్ బొబ్బిలి సినిమాకు ప్రాణం పోస్తాడు. రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశాడు. రెండో మూవీని కూడా సందీప్‌కే చేసి పెట్టు. కొత్త నిర్మాతలు ఇలాంటి మంచి చిత్రాలు తీసినప్పుడు అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఇది మీడియాకు నచ్చిన చిత్రం.. మీడియాకు నచ్చిందంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని అర్థం’ అని అన్నారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘సైరాట్ మూవీ మేకింగ్‌ను డాక్యుమెంటేషన్ చేశారు. ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మేకింగ్‌ని కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకోండని చెప్పాను. చిన్న రూంలోనే సినిమా పనులన్నీ చేసేశారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని మీడియా చాలా సపోర్ట్ చేసింది. ఈ చిత్రం కోసం మేం ఆర్థికంగా చాలా కష్టపడ్డాం. రోహన్ అయితే మా కోసం ఇన్ స్టాలో ఎక్కువగా ప్రమోట్ చేశాడు. ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది. ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు. మౌత్ టాక్, మౌత్ పబ్లిసిటీతోనే నా సినిమాలు ఆడుతుంటాయి. ఇప్పుడిప్పుడే మా సినిమా పికప్ అవుతోంది. మా చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా, సోషల్ మీడియాకు థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘మీడియా లేకపోతే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈ స్థాయికి వచ్చేది కాదు. ఒక్క నెగెటివ్ రివ్యూ, కామెంట్ లేకుండా అందరూ ప్రశంసిస్తున్నారు. మీడియానే మా మూవీని ముందుకు తీసుకెళ్తోంది. తిరువీర్ అన్న, సందీప్ అన్న కోసం ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఒంటెద్దు బండిలా తిరువీర్ అన్న ఈ చిత్రాన్ని ముందుకు తీసుకు వచ్చారు. ఇలాంటి కథలు థియేటర్లో ఆడవా? అని అనుకున్నాను. కానీ ఆడియెన్స్ మాత్రం మా సినిమాను పెద్ద సక్సెస్ చేశారు. ఇది సక్సెస్ అవ్వడంతో సహజత్వంతో కూడిన ఇలాంటి కథల్ని చేసేందుకు అందరూ ముందుకు వస్తారు. ఈ చిత్రంతో సందీప్ గారు అన్ని క్రాఫ్ట్‌ల మీద నాలెడ్జ్ పెంచుకున్నారు. శేఖర్ కెమెరా వర్క్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. అశ్విన్ సౌండ్ డిజైన్ బాగుందని మెచ్చుకుంటున్నారు. సనారే అయితే వెంటనే లిరిక్స్ ఇస్తుండేవారు. నరేష్ గారి ఎడిటింగ్ మా సినిమాకు చాలా హెల్ప్ అయింది. సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచింది. టీం అంతా వంద శాతం ఇష్టపడి, కష్టపడి పని చేయడం వల్లే ఈ స్థాయి విజయం దక్కింది. మళ్లీ ఇదే కాంబోతో, ఇదే టీంతో మరో సినిమాను చేయాలని కోరుకుంటున్నాను. తనకు వచ్చిన అవకాశాన్ని తన శిష్యుడికి ఇచ్చిన నా గురువు గారు గురు కిరణ్‌కి థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్లు చూసి మీడియా వాళ్లు గంట సేపు మాట్లాడారు. మీడియా వల్లే మా మూవీ ఆడియెన్స్ వరకు రీచ్ అయింది. టీఎఫ్‌జేఏకి నా వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను నిలబెట్టిన మీడియాకు థాంక్స్. ఈ మూవీనే నన్ను నిర్మాతగా మార్చింది. ఇదంతా కూడా రాహుల్ వల్లే జరిగింది. మంచి చిత్రాన్ని నిర్మించావని నా సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులంతా మెచ్చుకుంటున్నారు. ఈ మూవీని వెన్నంటే ఉండి సపోర్ట్ చేసిన తిరువీర్ అన్నకి థాంక్స్. ఆడియెన్స్ మా సినిమా చూసి మంచి లాభాల్ని అందిస్తే మరిన్ని మంచి చిత్రాలను నిర్మిస్తాను’ అని అన్నారు.

హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన డైరెక్షన్ టీంకు థాంక్స్. మా కోసం వచ్చిన బీవీఎస్ రవి సర్‌కు థాంక్స్. ప్రతీ సీన్‌ను ఆడియెన్స్‌ ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీని చూడని వాళ్లంతా చూడండి’ అని అన్నారు.

నటి యామిని మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మాకోసం వచ్చిన బీవీఎస్ రవి సర్‌కి థాంక్స్. ఆడిషన్స్ చేసినప్పుడు సెలెక్ట్ అవుతానా? లేదా? అని టెన్షన్ పడ్డాను. సినిమా చాలా బాగా వచ్చింది. మీడియా కూడా మంచి రివ్యూలు ఇచ్చింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంకా చూడని వాళ్లంతా కూడా మా మూవీని చూడండి’ అని అన్నారు.

నటుడు నరేంద్ర రవి మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ అందరికీ మా చిత్రం నచ్చింది. నాకు శ్రీకాకుళం యాస తెలీదు. కానీ రాహుల్ అన్న మాత్రం దగ్గరుండి నాకు ఈ యాసను నేర్పించారు. సినిమా మీద ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించడం లేదు. తిరువీర్ అన్న ఈ మూవీని భుజానికి ఎత్తుకుని ముందుకు నడిపించారు. ‘జార్జిరెడ్డి’ చూసిన తరువాత తిరువీర్ అన్నకి ఫ్యాన్ అయిపోయాను. రాహుల్ అన్న నన్ను యాక్టర్‌గా నిలబెట్టారు. సురేష్ అన్న మ్యూజిక్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. మా చిత్రాన్ని చూడనివారు త్వరగా చూడండి. అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్. గత ఐదేళ్ల కోసం నేను ఓ మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. నా పాటలు బాగుంటున్నాయి.. కానీ సినిమాలు ఆడటం లేదు అని అంతా అంటుండేవారు. కానీ ఇప్పుడు మాత్రం నాకు మంచి గుర్తింపుతో పాటు, మంచి సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్ కోసమే నేను ఇన్నేళ్లు కష్టపడుతూ వచ్చాను. పడుతూ లేస్తూ అథ:పాతాళానికి వెళ్లినా కూడా ఇలా సక్సెస్ సాధించాను. ఈ మూవీని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలని మీడియాని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మాస్టర్ రోహన్ మాట్లాడుతూ .. ‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కోసం ట్వీట్ వేసిన విజయ్ దేవరకొండ అన్నకు థాంక్స్. మేం ఈ మూవీ కోసం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాహుల్ అన్నకి థాంక్స్. నాకు సపోర్ట్‌గా నిలిచిన తిరువీర్ సర్‌కు థాంక్స్. మా మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

ఎడిటర్ నరేష్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థాంక్స్. మా నిర్మాతలు సందీప్, పద్మినీ గారు గత వారం నుంచి ఒత్తిడిలో ఉన్నారు. కానీ ఈ మూవీ బయటకు వచ్చిన తరువాత వారి మొహంలో నవ్వులు కనిపిస్తున్నాయి. ఇలా అందరినీ ఎంటర్టైన్ చేసే చిత్రాల్ని వారు మరిన్ని నిర్మిస్తారని ఆశిస్తున్నాను. పెట్టే డబ్బులకు సరిపడేలా సినిమా అందరినీ నవ్విస్తుంది. తిరువీర్ గారు ఎప్పుడూ ఇలాంటి డిఫరెంట్ స్టోరీలనే ఎంచుకుంటూ ఉంటారు. రాహుల్ కథ, తిరువీర్ సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది. ఇంకా ఈ మూవీని చూడని వారంతా చూడండి’ అని అన్నారు.

సౌండ్ డిజైనర్ అశ్విన్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీకి పని చేసే అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

నటుడు జోగా రావు మాట్లాడుతూ .. ‘తెలుగు భాష ఎంత గొప్పగా ఉంటుందో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా కూడా అంతే గొప్పగా ఉంటుంది. రాహుల్ ఈ మూవీని చాలా గొప్పగా తీశారు. మా మూవీని ఆదరిస్తున్న మీడియా, ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

లిరిసిస్ట్ సనారే మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి అన్ని పాటలు నేనే రాశాను. నన్ను నమ్మి సురేష్ అన్న నాకు అవకాశం ఇప్పించారు. నన్ను నమ్మిన చిత్ర యూనిట్‌కు థాంక్స్. తిరువీర్ గారు, సందీప్ గారు వంటి మంచి వ్యక్తులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

తారాగణం : తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్, నరేంద్ర, యామిని తదితరులు

సాంకేతిక సిబ్బంది
బ్యానర్ : 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్
నిర్మాతలు : సందీప్ అగరం & అశ్మితా రెడ్డి బసాని
రచయిత & దర్శకుడు: రాహుల్ శ్రీనివాస్
సహ నిర్మాత: కల్పనారావు
సంగీతం: సురేష్ బొబిల్లి
DOP: K సోమ శేఖర్
ఎడిటర్: నరేష్ అడుప
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రజ్ఞయ్ కొణిగారి
ప్రొడక్షన్ డిజైనర్: ఫణి తేజ మూసి
పీఆర్వో : నాయుడు సురేంద్రకుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

2 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago