డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో  సెన్సేషనల్ ప్రాజెక్ట్

Must Read

ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు వైవిఎస్ చౌదరి. దర్శకునిగా రచయితగా నిర్మాతగా అనేక విజయవంతమైన చిత్రాలని అందించారు. శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి, సీతారామ రాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు లాంటి బ్లాక్ బస్టర్స్ తో ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన దర్శకుడు వైవిఎస్ చౌదరి నుంచి మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ రాబోతుంది.

 రేపు (మే 23) దర్శకుడు వైవిఎస్ చౌదరి పుట్టిన రోజు. అలాగే ఆయన అభిమాన దర్శకులు, దర్శకేంద్రులుశ్రీ కె. రాఘవేంద్రరావుగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరంలోనే ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నారు వైవిఎస్ చౌదరి. ప్రతిభగల కొత్త నటీనటులతో.. న్యూ ఏజ్ యూనిక్  కంటెంట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ ప్రాజెక్ట్ వుండబోతోంది. ఈ సినిమాకి సంబధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News