ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్

ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద

లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, మైదానంలో బంతితో మాయాజాలం సృష్టించిన శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకులు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు.

‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఏడాదిన్నర పాటు చిత్ర బృందం అంతా ఎంతో శ్రమించి సినిమా తీశారు. శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, చెన్నై, కొచ్చిన్, చండీగఢ్‌లో చిత్రీకరణ చేశారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కించిన చిత్రమిది.

ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ”ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ… 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనత మురళీధరన్ సొంతం. బాల్యం నుంచి ఆయన పడిన స్ట్రగుల్స్, ఆయన జర్నీ అంతా సినిమాలో ఉంటుంది. ఇటువంటి చిత్రాన్ని ఆలిండియాలో పంపిణీ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత ఏడాది మా ‘యశోద’ను ఆలిండియాలో విడుదల చేసి నిర్మాతగా సక్సెస్ అందుకున్నాను. ఇప్పుడు ‘800’ను జాతీయ స్థాయిలో పంపిణి చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. రీ రికార్డింగ్, గ్రాఫిక్ వర్క్స్ తుది దశలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో ట్రైలర్, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.

మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : ప్రవీణ్ కెఎల్, సినిమాటోగ్రఫీ : ఆర్.డి. రాజశేఖర్, మ్యూజిక్ : జిబ్రాన్, రచన & దర్శకత్వం : ఎంఎస్ శ్రీపతి.

Tfja Team

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

9 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago