ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90వ జయంతి

Must Read

ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌. తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934 , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు . నేడు ఆయన 90వ జయంతి .

శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం సాధించారు . ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు . అది మంచి విజయం సాధించింది .తదుపరి చిత్రం కళా తపస్వి కే. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం . తెలుగు చిత్ర ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకు వెళ్లిన అద్భుత కావ్యం . ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు , box office కలెక్షన్స్ గాని , జాతీయ – అంతర్జాతీయ – రాష్త్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే , అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం . అలాగే ఏ దేశమెళ్ళెనా, శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో .ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ఇన్స్పిరేషన్ .

ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది . ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కే.విశ్వనాధ్ కాంబినేషన్ లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . అవార్డులు తో పాటు రివార్డులు సొంతం చేస్కుకున్నదీ చిత్రం . తెలుగు, తమిళం & మలయాళం లో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది . తదుపరి చిత్రం మరో క్లాసిక్ – సితార . ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ever green classic . సితార కి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది .ఇక స్వాతిముత్యం – కే.విశ్వనాధ్ ,కమలహాసనన్‌, రాధిక ల కలయిక లో వచ్చిన ఆణిముత్యం . 1986 లో విడులయ్యిన ఈ చిత్రం , అప్పటికి బాక్స్ ఆఫీస్ records ని బీట్ చేసింది . జాతీయ అవార్డు , రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం . ఇక స్వయంకృషి – మెగాస్టార్ చిరంజీవి తో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా , ఓ సాధారణ చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే . అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద . మంచి విజయం సాధించిన ఈ చిత్రం , చిరంజీవి కి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది .ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరో గా చేసిన స్వరకల్పన ఆశించనంతగా ఆడలేదు . మళ్ళీ విశ్వనాధ్ – చిరంజీవిలతో తీసిన చిత్రం , ఆపత్బాంధవుడు . చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ . రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు .అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచంలో మిస్ అయ్యింది .


తీసిన 10 సినిమాలు కళా ఖండాలే… అదుపు తప్పిన సినిమాలకు “కాపు” కాసిన నిర్మాతకు గుర్తింపు ఏది?


మంచి చిత్రాలు నిర్మించాలంటూ తరుచూ చెప్పే ప్రభుత్వం ఇన్ని మంచి చిత్రాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావును ఏ రీతిన గౌరవించింది? అని ప్ర‌శ్నించుకుంటే.. కనీసం పద్మ శ్రీ‌ కూడా ఇవ్వలేదు. తెలుగు సినిమాకు తొలి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన నిర్మాత ఆయన. దాదా సాహెబ్ పాల్కే అవార్డు కు నామినేట్ అయ్యారు, కానీ అవార్డు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా సినీ రాజకీయాల మూలాన రాలేదు. మంచి చిత్రం కోసం కోట్లాది రూపాయలు పణంగా పెట్టిన ఒక గొప్ప నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కిందా? అన్న‌ది ట‌న్ను బ‌రువైన ప్ర‌శ్న‌. కనీసం మరణానంతరం ఇవ్వగలిగిన పురస్కారాలు ‌ఇవ్వచ్చు. ఓ ర‌కంగా ప్రభుత్వాల కంటే ప్ర‌యివేటు సంస్థ‌లే ఆయ‌న ప్రతిభను బాగా గుర్తించాయి. కళా సాగర్ వారు దశాబ్తపు ఉత్తమ నిర్మాత గా అవార్డునిచ్చి గౌర‌వించారు. సంగం అకాడమీ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌, సంతోషం లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో స‌త్క‌రించి గౌర‌వించాయి.

Latest News

Raghavendra Rao unveiled the glimpses of the movie Abhimani

Film journalist and producer Suresh Kondeti has become very popular on social media. Having already entertained audiences with several...

More News