ప్రతి ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వరించే ఫిలింఫేర్ అవార్డ్స్ మొదటిసారి బెంగుళూరు వేధికగా జరుగనున్నాయి. కమర్ ఫిలిం ఫ్యాక్టరీ, ఫిలింఫేర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 67వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 2020-2021 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రధానం చేయనున్నారు. నాలుగు దక్షిణాది భాషల్లోని ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో పూజా హెగ్దే, కృతిశెట్టి, మృణాల్ ఠాకూర్ తదితరులు తమ అందమైన డ్యాన్స్ పెర్‌ఫామెన్స్‌లతో అలరించనున్నారు. అక్టోబరు 9న ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ బెంగుళూరులో ఈ కార్యక్రమం జరుగనుంది.