తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన నట ప్రస్థానం నేటికి 22 ఏళ్లకు చేరుకుంది. 2002, నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా “ఈశ్వర్” ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి చిత్రమే ఘన విజయం సాధించి ప్రభాస్ అప్రతిహత నట ప్రస్థానానికి పునాది వేసింది. ఈశ్వర్ లో ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ప్రభాస్ ను చూసి ఫ్యూచర్ స్టార్ అని అప్పుడే డిక్లేర్ చేశారు. వారి అంచనాలు మించేలా స్టార్ గా ప్రపంచ ఖ్యాతిని దక్కించుకుంటున్నారు ప్రభాస్.
‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘రెబల్’, ‘మిర్చి’ వరకు ప్రభాస్ జర్నీ ఒక ఫేజ్ అయితే బాహుబలితో ఆయన పాన్ ఇండియా జర్నీ బిగిన్ అయ్యింది. బాహుబలి రెండు చిత్రాల తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ప్రభాస్ రెండు సార్లు(బాహుబలి 2, కల్కి 2898 ఎడి) వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలను ఖాతాలో వేసుకోవడం ఒక రేర్ రికార్డ్. ఓవర్‌సీస్ మార్కెట్‌లో పది మిలియన్లకుపైగా వసూళ్లను సాధించిన తొలి హీరోగా ప్రభాస్ నిలిచారు.
ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా…ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్. వీటితో పాటు హోంబలే ఫిలింస్ మరో రెండు చిత్రాలను ప్రభాస్ తో నిర్మించనున్నట్లు ప్రకటించింది. ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించబోతున్నాయి.
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…