“1920 భీమునిపట్నం” చిత్రానికి ఇళయరాజా సంగీతం

Must Read

భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్యేగాల మధ్య నడిచే కథతో “1920 భీమునిపట్నం” చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తొలిచిత్రం విడుదలకు మునుపే ఒకేసారి ఐదు సినిమాలలో నటిస్తూ, సంచలనం సృష్టిస్తున్న కంచర్ల ఉపేంద్ర హీరోగా నటించనున్న ఈ చిత్రాన్ని ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. “1940లో ఒక గ్రామం”, “కమలతో నా ప్రయాణం ” వంటి పలు అవార్డుల చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్నారు.

వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, “తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలిగే కథ. మన స్వతంత్ర పోరాటంలో మనకు తెలియని కథలు చాలా ఉన్నాయి. సీతారాం, సుజాత ప్రేమకధను దర్శకుడు అద్భుతంగా తయారు చేశారు. ఆస్కార్ స్థాయికి తగట్టుగా తెరకెక్కించబోతున్నాం. అందుకే మేము ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను కలవడం, కథ చెప్పడం, వారికి నచ్చడం జరిగింది. వారి సంగీతం ఈ చిత్రానికి ఓ హైలైట్ గా నిలుస్తుంది.
ఇప్పటివరకు ఇలాంటి కథను వినలేదని ఇళయరాజా చెప్పడం మాకెంతో ప్రేరణను కలిగించింది” అని అన్నారు.

హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, “నా కెరీర్ లో ఇదో విభిన్న చిత్రమవుతుంది. నటనకు ఎంతో స్కోప్ ఉన్న కథ. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. అవార్డుల దర్శకుడు నరసింహ నంది ఈ చిత్రం చేస్తుండటం ఓ విశేషం” అని అన్నారు.

దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, “1920- 22 సంవత్సరాల మధ్య కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన నిరాశ, నిసృహ, అసంతృప్తి అలుముకున్న సమయంలో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంబించారు ఉద్యమానికి ఆకర్షితులైన ఎంతోమంది యువతీయువకులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమంలోకి అడుగుపెట్టారు. అలాంటివారిలో సీతారాం, సుజాత స్వతంత్ర పోరాట నేపథ్యంలో జరిగే ప్రేమికుల కథ.ఇది. ఇళయరాజా సంగీతం నా చిత్రానికి అందిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను స్వతంత్ర పోరాటం తీసుకుని అందులో కొన్ని ఊహాజనిత పాత్రలు. కొన్ని నిజ జీవితంలో జరిగిన పాత్రలు ప్రేరణగా తీసుకుని ఈ ప్రేమకధను తయారుచేయడం జరిగింది” అని చెప్పారు.

పలువురు ప్రముఖ నటీనటులు నటించే ఈ చిత్రానికి సహ నిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత, నిర్మాత: కంచర్ల అచ్యుతరావు, దర్శకత్వం: నరసింహ నంది.

Latest News

Naa Swase Nuvvai Song sung by Hero Siddharth from It’s Okay Guru released

Charan Sai and Usha sri are playing the lead roles in the upcoming movie It's Okay Guru, produced by...

More News