మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ పాన్-ఇండియన్ మూవీ మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ మూవీని హ్యుజ్ కాన్వాస్‌పై హైబడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు.
జూన్ 19 నుంచి మట్కా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యాసీవ్ సెట్‌ను నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ గెటప్‌లలో కనిపించనున్న ఈ చిత్రంలో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు, యావత్ దేశాన్ని కదిలించిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా కథ డిఫరెంట్ టైమ్స్ లో సెట్ చేయబడింది. త్వరలో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లు మేకర్స్ తెలియజేస్తారు.
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఓపెనింగ్ బ్రాకెట్ టీజర్ విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ సినిమా ప్రిమైజ్ ని అద్భుతంగా చూపింది. నవీన్ చంద్ర, పి రవి శంకర్ వంటి కొన్ని ముఖ్యమైన పాత్రలను కూడా పరిచయం చేసింది.
ఈ చిత్రానికి ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్, జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: A కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…