హీరో హ‌వీష్‌కి బ‌ర్త్ డే విషెష్ చెప్పిన ‘ఎస్ బాస్’  టీమ్‌..

ప్ర‌ముఖ నిర్మాత‌, విద్యావేత్త‌, కె.ఎల్‌.యూనివ‌ర్సిటీ చైర్మ‌న్ కొనేరు స‌త్య‌నారాయ‌ణ సినీ రంగంలోనూ రాణిస్తున్నారు. కె స్టూడియోస్ బ్యానర్‌పై ‘రాక్ష‌సుడు’, ‘ఖిలాడి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ఆయ‌న ఇప్పుడు త‌న త‌దుపరి చిత్రం ‘ఎస్ బాస్’ను రూపొందిస్తున్నారు. కాంచ‌న కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‘సెవన్’ తర్వాత డైన‌మిక్ యాక్ట‌ర్ హ‌వీష్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. ‘నువ్విలా’ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన హ‌వీష్, ‘రామ్ లీల‌’, ‘జీనియ‌స్’ వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

‘భాగమతి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అశోక్ ‘ఎస్ బాస్’ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా అన్నీ అంశాల‌తో రూపొందుతోంది. మంగ‌ళ‌వారం హ‌వీష్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఎస్ బాస్ చిత్రం నుంచి హ‌వీష్ స్టైలిష్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. 

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌తోన్న ‘ఎస్ బాస్’ చిత్రంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత ఆకుల శివ ఈ చిత్రాన్ని క‌థ‌, మాట‌ల‌ను అందించారు. సీనియ‌ర్ స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషించారు. ఆయ‌న ఈ చిత్రంలో న‌టిస్తుండ‌టంతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. ప్ర‌ముఖ టెక్నీషియ‌న్ క‌బీర్ లాల్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

14 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

14 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago