హీరో నవదీప్ సమర్పిస్తున్న, ‘సగిలేటి కథ’ మూవీ ట్రైలర్ ఈ నెల 31న విడుదల…

రవితేజ మహాదాస్యం, విషిక కోట నూతన నటి నటులు జంట గా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం లో తెరకెక్కించబడిన చిత్రం ‘సగిలేటి కథ’. అందరికి సుపరిచితుడైన హీరో నవదీప్ సి- స్పేస్ సమర్పణలో, అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఒక గ్రామం లోని పాత్రల మధ్య జరిగే నాటకీయ ఘటనల ఆధారంగా ఆయా పాత్రల మనస్తత్వాలకు అద్దం పడుతూ, అన్ని రకాల భావోద్వేగాలను నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ఇది ఒక కాంటెంపరెర్రి విలేజ్ డ్రామ, పాత్రల చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలతో కొద్దిరోజులు మీరు పక్కా ట్రావెల్ చేస్తారు. ప్రతి పాత్ర చాలా సహజం గా ప్రత్యేక శైలి లో ఉండబోతుంది. ఇందులో చికెన్ కూడా ఒక పాత్ర.
“చికెన్ అంటే కూరో, వేపుడో కాదు…చికెన్ అంటే ఒక ఎమోషన్ “. మలయాళం, తమిళ్ వంటి భాషలలో వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్ ని సినిమా రూపంలో చాలా కథలు చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ‘సగిలేటి కథ’ ద్వారా రాయలసీమ నేటివిటీ, కల్చర్ అండ్ ట్రెడిషన్ ని కథ రూపం లో వచ్చే ఆయా సన్నివేశాలు చూసి మన ఏపీ & తెలంగాణ లో మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం.

గతంలో షేడ్ స్టూడియోస్ వారు తమ షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ‘కనబడుటలేదు’ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడు కొత్త వారికి అండగా ఉండే షేడ్ స్టూడియోస్ మరొకసారి నూతన నటి నటులు, సాంకేతిక బృందం తో కలిసి ఇప్పుడు రెండవ చిత్రం గా ఈ “సగిలేటి కథ” ను చక్కని విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

సగిలేటి కథ కేవలం సినిమా కాదు. మన జీవితంలో ఉండే అన్ని భావోద్వేగాలా సమర్పణ. ప్రతి ఒక్క పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమా లో హీరో గా చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను.

ఈ చిత్రాన్ని చూసి, హీరో నవదీప్ ప్రేక్షకుల ముందుకి తన సమర్పణ లో తీసుకురావడం కొండంత బలం చేకూర్చిందని చిత్ర బృందం తెలిపింది. ఈ నెల 31 వ తారీకు ట్రైలర్ ని విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ పేర్కొన్నారు

ఈ చిత్రానికి రచయిత, సినిమాటోగ్రఫి, ఎడిటర్, దర్శకత్వం రాజశేఖర్ సుద్మూన్ అందించారు.

నటి నటులు: రవితేజ మహాదాస్యం, విషిక కోట
నిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవిప్రసాద్ బలివాడ ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ బాబు మాదినేని సంగీతం: జశ్వంత్ పసుపులేటి
నేపథ్య సంగీతం సనల్ వాసుదేవ్
రచన: రాజశేఖర్ సుద్మూన్ శశికాంత్ బిల్లపాటి
ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణి
సాహిత్యం: వరికుప్పల యాదగిరి, రాజశేఖర్ సుద్మూన్, శశికాంత్ బిల్లపాటి, పవన్ కుందని
పీఆరోఓ: తిరుమలశెట్టి వెంకటేష్
పబ్లిసిటీ డిజైనర్: యమ్ కే యస్ మనోజ్

Tfja Team

Recent Posts

ఎలైట్ క్రికెట్ లీగ్ లో ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగే ‘అనకాపల్లి’ ట్రైలర్ ను విడుదల చేసిన టాలీవుడ్ థండర్స్ టీం.. ఆగస్ట్ 7న భారీ ఎత్తున చిత్రం విడుదల

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల…

7 hours ago

హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘సిత్తరాల నవ్వు’ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

9 hours ago

ఘనంగా ‘తీరం’ టైటిల్ సాంగ్ విడుదల

▪️ భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘తీరం’ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న…

9 hours ago

పాన్ ఇండియా యాక్టర్ సునీల్ చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” ట్రైలర్ రిలీజ్

-ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "అదే నీవు అదే నేను" సినిమా ఇటీవల ప్రకటించిన…

9 hours ago

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ ప్రచారానికి శ్రీకారం..*‘చిట్టిబాబు‘గా విక్టరీ వెంకటేష్ పాత్ర పరిచయం

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక కుటుంబ కథా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)”…

11 hours ago