హీరో అల్లరి నరేష్ లాంచ్ చేసిన బి. శివప్రసాద్, శ్రీ పద్మిని సినిమాస్ ‘రారాజా’ టీజర్

సుగి విజయ్, మౌనిక మగులూరి హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం రా రాజా. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి. శివప్రసాద్ స్వీయా నిర్మాణ దర్శకత్వం వహించారు. తాజాగా హీరో అల్లరి నరేష్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు.

నిమిషన్నర నిడివి గల టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. క్యారెక్టర్ ని చూపించకుండా, ఒక్క డైలాగ్ కూడా లేకుండా కట్ చేసిన ఈ ట్రైలర్ హారర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టెర్రిఫిక్ అనిపించింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వున్నాయి. దర్శకుడి కాన్సెప్ట్, టేకింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. మొత్తనికి టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది.

టీజర్ లాంచ్ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై శివప్రసాద్ దర్శకత్వం వహించిన రారాజా సినిమా టీజర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది .డైరెక్టర్ కథ చెబుతున్నంత సేపు చాల ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో నేను చాల ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే దీనిలో నటించిన ఇరవై నాలుగు క్యారెక్టర్స్ ఎవరి ఫేస్ లు కనిపించకపోవడం. అదే విషయం డైరెక్టర్ ని అడిగితే చూస్తున్నంత సేపు ఏ ఆడియన్ కూడా ఎంగేజ్ మిస్ అవ్వడు, వింటున్నంత సేపు మీరు ఎలా ఫీల్ అయ్యారో అలాగే ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు అని చెప్పారు. A.I జనరేషన్ లో కూడా అసలు మొహాలు కనిపించకుండా సినిమా ఎలా తీశారు..ఆ ఒక్క రీజన్ కోసం అయినా త్వరగా చూడాలని ..సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తుందని నాకు అనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు.

ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా రాహుల్ శ్రీవాత్సవ్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతి ఎడిటర్ కాగ, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ నందు మాస్టర్.

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

బ్యానర్: శ్రీ పద్మిని సినిమాస్
తారాగణం : సుగి విజయ్, మౌనిక మగులూరి & ఇతరులు
నిర్మాత & దర్శకుడు: బి. శివప్రసాద్
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
ఎడిటర్: ఉప్పు మారుతి
డీవోపీ : రాహుల్ శ్రీవాత్సవ్
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు
యాక్షన్: నందు మాస్టర్
పీఆర్వో : తేజస్వి సజ్జా
డిజిటల్: రెయిన్బో మీడియా

Tfja Team

Recent Posts

ఘనంగా డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ “నిరమ్” ట్రైలర్, ఆడియో లాంఛ్

-త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో…

5 hours ago

‘కాళాంకి భైరవుడు’నుంచి ‘ఏంటో ఏమో’ పాట విజయవాడలో ఘనంగా విడుదల

విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ 'కాళాంకి భైరవుడు' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ…

6 hours ago

ఎం.ఎస్. రాజు మిస్టిక్ డివైన్ థ్రిల్లర్‘అగధ’ ట్రైలర్ ఆగస్టు 3న విడుదల!

ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ పై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.…

12 hours ago

హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) థ్రిల్లర్ మూవీ “ది మేజ్” నుంచి ఫస్ట్ సింగిల్ ‘నన్నే నన్నే..’రిలీజ్

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ…

1 day ago

జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

▪️ తెలుగు, కన్నడ భాష‌ల్లో జూన్‌లో విడుద‌లైన చిత్రం▪️ 300 థియేట‌ర్‌ల‌లో విడుద‌లై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల…

1 day ago

నేడు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో పావలా శ్యామల అంత్యక్రియలు

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుండి…

3 days ago