స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ గ్రాండ్ రిలీజ్

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

‘ఆయ్’ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ రూపంలో తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆయ్ సినిమాను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆయ్‌’ను విడుద‌ల చేయ‌టానికి ఇండిపెండెన్స్ డే ప‌ర్‌ఫెక్ట్ డేట్. ఎందుకంటే ఆగ‌స్ట్ 15న గురువారం, త‌ర్వాత రోజు నుంచి వీకెండ్ ప్రారంభం అవుతుంది. ఇక సోమ‌వారం రోజున ర‌క్షా బంధ‌న్ కావున ఆ రోజు కూడా క‌లిసొస్తుంది. ఆయ్ సినిమా నుంచి ఇప్ప‌టికే క్యారెక్ట‌ర్ టీజ‌ర్‌, పాట‌ల‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. రెగ్యుల‌ర్‌గా మూవీ అప్‌డేట్స్‌ను ఇస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌తో ఆయ్ సినిమా రూపొందింది. ఈ ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో నార్నే నితిన్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు.

మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించటానికి మంచి టీమ్ కూడా చేతులు క‌లిపింది. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.

GA2 పిక్చర్స్:

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – GA2 పిక్చర్స్, సమర్పణ – అల్లు అరవింద్, నిర్మాతలు – బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ – అంజి కె.మ‌ణిపుత్ర‌, సహ నిర్మాతలు – భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ – సమీర్ కళ్యాణి, సంగీతం – రామ్ మిర్యాల, ఎడిటర్ – కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ – సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ – రామ నరేష్ నున్న
పి.ఆర్.ఒ – వంశీ కాకా, మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట, పోస్టర్స్ – అనిల్, భాను.

Tfja Team

Recent Posts

మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్- సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత…

22 minutes ago

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల…

58 minutes ago

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

1 day ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

1 day ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

1 day ago