‘స్వయంభూ’ కోసం మాస్టర్ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్

హీరో నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్ వర్క్ చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని చేసిన మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్ ‘స్వయంభూ’లో తన మ్యాజిక్‌ చూపించనున్నారు.

మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఈ టాప్  టెక్నిషియన్ ఇప్పటికే టీంలో చేరారు. మ్యాసీవ్ సెట్స్ తో గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోందని మేకింగ్ వీడియో చూస్తే అర్ధమౌతోంది. నిఖిల్‌కి ఇప్పటి వరకు మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా ఇదే.

కెకె సెంథిల్ కెమెరా డీవోపీగా చేయడంతో సినిమాలోని విజువల్స్ టాప్ నాచ్‌గా ఉండబోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్‌లో జరుగుతోంది.

నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ నిఖిల్‌ను సవ్యసాచిలా  రెండు కత్తులతో, యుద్ధంలో శ్రతువులతో పోరాడుతున్న లెజండరీ వారియర్ గా ప్రజెంట్ చేస్తోంది. మెరూన్ కలర్ కాస్ట్యూమ్ ధరించి, పొడవాటి జుట్టు, మెలితిప్పిన మీసాలు, గడ్డం, మజల్ద్ ఫిజిక్, బైసప్స్ తో బీస్ట్ మోడ్ లో కనిపించారు నిఖిల్.  

భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీ. ఇందులో లెజెండరీ వారియర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. క్యారెక్టర్ కోసం వెపన్స్, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. KGF, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్.

రిచ్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

నటీనటులు: నిఖిల్, సంయుక్త, నభా నటేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
డీవోపీ: KK సెంథిల్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్
సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago