వయనాడ్ బాధితులకు రెబెల్ స్టార్ ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం

Must Read

సమాజంలో ఏ విపత్తు జరిగినా తక్షణమే స్పందిస్తుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. పెద్ద మనసుతో భారీగా విరాళం ఇస్తుంటారు. కేరళలోని వయనాడ్ లో జరిగిన ప్రకృతి విపత్తు బాధితులకు ఆపన్నహస్తం అందించారు ప్రభాస్. వయనాడ్ బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ విరాళం అందిస్తున్నారు ప్రభాస్. వయనాడ్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రభాస్ తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని, వారికి మనమంతా అండగా ఉండాలని ప్రభాస్ కోరారు.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News