యేవ‌మ్ చిత్రం నుంచి ర్యాప్ సాంగ్ విడుద‌ల

రొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్‌తో చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు ప్రకాష్‌ దంతులూరి . ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘యేవమ్‌’ చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఏది మంచి..ఏది కాదు అనే ర్యాప్ సాంగ్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్‌భాస్క‌ర్ విడుదల చేశారు.

 ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ మ‌హిళ సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంతో మినింగ్‌ఫుల్‌గా, కొత్త‌గా వుంటుంది. ఈ చిత్రంలో ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Tfja Team

Recent Posts

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…

8 hours ago

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన హీరో సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నూతన చిత్రం

హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…

12 hours ago

మే 1న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నెక్ట్స్ మూవీ “సమ్మర్ హాలిడేస్”

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…

12 hours ago

పాన్‌ సౌత్ స్టార్‌తో సైకాలజికల్ థ్రిల్లర్.. అనుపమ పరమేశ్వరన్ కొత్త మూవీ అనౌన్స్!

పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌ను ఎస్ కే…

12 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ ఫిబ్రవరి 27న థియేటర్స్ లో విడుదల !!!

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

15 hours ago

కంప్లీట్ ఎంటర్ టైనర్ “క్రేజీ కల్యాణం” మూవీ నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…

16 hours ago