“మల్లేశం”దర్శకనిర్మాత మరో మంచి చిత్రం”8 ఎ.ఎమ్. మెట్రో”

“మల్లేశం” చిత్రంతో అటు ప్రేక్షకులు – ఇటు విమర్శకుల ప్రశంసలు దండిగా అందుకున్న “ప్రవాస తెలంగాణ ముద్దుబిడ్డ” రాజ్ రాచకొండ తాజాగా రూపొందించిన చిత్రం “8 A.M మెట్రో”. స్వీయ దర్శకత్వంలో కిషోర్ గంజితో కలిసి రాజ్ రాచకొండ నిర్మించిన ఈ చిత్రం రేపు (మే 19) తొలుత హిందీ భాషలో విడుదల కానుంది.

తదుపరి అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అనువాదం కానుంది!!
గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పిక గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సన్నీ కుర్రపాటి సినిమాటోగ్రఫీ, మార్క్ కె.రాబిన్స్ సంగీతం అందించారు. అనిల్ ఆలయం ఎడిటింగ్. ఉదయ్ తిరుచాపల్లి వి.ఎఫ్.ఎక్స్ బాధ్యతలు నిర్వహించారు. భావావేశం మెండుగా కలిగినప్పటికీ… నిర్లిప్తంగా సాగిపోతున్న ఒక వివాహిత జీవితంలో… “మెట్రో ట్రైన్”లో జరిగిన పరిచయం… “స్నేహం”గా మారడం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని కవితలు ప్రఖ్యాత గీత రచయిత – ఆస్కార్ అవార్డు గ్రహీత గుల్జార్ రాయడం విశేషం!!

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago