శర్వానంద్, కృతి శెట్టి, హేషమ్ అబ్దుల్ వహాబ్, శ్రీరామ్ ఆదిత్య, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మనమే’ సోల్‌ఫుల్ టైటిల్ ట్రాక్ విడుదల
తన చార్ట్‌బస్టర్ ఫామ్‌ను కొనసాగిస్తూ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మరో సూపర్ హిట్ ఆల్బమ్‌ను అందించాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో డైనమిక్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘మనమే’ చిత్రం బ్యూటిఫుల్ ట్రాక్‌లతో అలరిస్తోంది. మొదటి పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ రెండవ సింగిల్-మనమేని విడుదల చేశారు.
హేషామ్ అబ్దువల్ వహాబ్ స్కోర్ చేసిన టైటిల్ ట్రాక్ ఫుల్ లైఫ్, వైబ్రెంట్ గా ఉంది. పాటలోని ఎమోషన్, కంపోజిషన్, లిరిక్స్, విజువల్స్ అద్భుతమైన అనుభూతి ఇస్తోంది. లీడ్ పెయిర్- శర్వానంద్, కృతి శెట్టి ఇంతకుముందు గొడవ పడే వారు ఇప్పుడు మంచి అనుబంధంకు వచ్చారు. ఇది కొత్త ప్రారంభం. ప్రతి క్షణం వారికి కొత్త అనుభవం.
శర్వానంద్, కృతి శెట్టి చక్కని కెమిస్ట్రీని పంచుకున్నారు. ప్రేమ ప్రయాణంతో పాటు, ఈ పాట విక్రమ్ ఆదిత్య పోషించిన పిల్లవాడితో వారి బంధాన్ని కూడా చూపిస్తుంది.
ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యం కృష్ణకాంత్ రాశారు, కార్తీక్, గీతా మాధురి గానం ఈ పాటకు అదనపు ఆకర్షణను జోడించింది. విజయ్ పోలాకి కొరియోగ్రఫీ చేశారు. శర్వానంద్ వేసిన మాప్ స్టెప్ అదిరిపోయింది. మనసుని హత్తుకునే ఈ టైటిల్ ట్రాక్ అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ పొజిషన్ లో నిలిచింది.
విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్లు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు.
‘మనమే’ జూన్ 7న థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్, ఫణి వర్మ
అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా
డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీవోపీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: జానీ షేక్
పీఆర్వో: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…