పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మువీగా మిగిలిపోయింది బిల్లా. హై క్లాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన ఈ మూవీ అంటే ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టం. ఇండియన్ స్క్రీ న్ మీద స్టైలిష్ ఫిల్మ్ అని పేరు తెచ్చుకున్న బిల్లా సినిమా డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న గ్రాండ్ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర స్పెషల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
రీ రిలీజ్ ను ఎయిమ్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. బిల్లా థీమ్ సాంగ్ నేపథ్యంగా సాగే ఈ ట్రైలర్ కృష్ణంరాజు గారి పోర్షన్ తో ప్రారంభమైంది. ఆయనకు నివాళిగా ట్రైలర్ లో కృష్ణంరాజు గారి పోర్షన్స్ పెట్టారు. ప్రభాస్ చేసిన హై ఎండ్ యాక్షన్ సీన్స్ వింటేజ్ ఫీల్ తీసుకొచ్చాయి. ఇవన్నీ ప్రభాస్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ కానున్నాయి. బిల్లా 4కె దేశవ్యాప్తంగానే కాదు యూఎస్ లోనూ గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. యూఎస్ లో అత్యధిక స్క్రీన్స్ తో రిలీజ్ చేస్తున్నారు.
అందరి బంధువు, చిత్రపరిశ్రమ శ్రేయోభిలాషి, కార్మికుల పాలిట పెన్నిధి, చిన్న నిర్మాతల పక్షపాతి, సినీ జర్నలిస్టుల ఆత్మీయుడు అయిన సీనియర్…
· కర్నూలు, విశాఖపట్నంలో సస్టైనబుల్ అపెరల్, చేనేత, బొమ్మల తయారీ కేంద్రాల ఏర్పాటుతో 1,050 మందికి ఉపాధి అవకాశాలు ·…
శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ మరియు సుఖ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ చార్లీ చాప్లిన్…
రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ చిత్రంలో అద్భుతమైన నటనతో కన్నడ నటుడు ప్రమోద్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కన్నడలో హీరోగా…
యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్ బాయ్స్’ (చాప్టర్ క్లోజ్). వికాస్,…
యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". ఈ సినిమాలో రాకేష్ వర్రే…