మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ మూవీ అత్యద్భుతంగా, శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
గురువారం చిత్ర యూనిట్ ‘దేవర’ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ప్రేక్షకులకు ఈ హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’, సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఎంటైర్ ఇండియాలోని సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ పాన్ ఇండియా భారీ చిత్రాన్ని విడుదల చేయటానికి ఇదే కరెక్ట్ డేట్ అని మేకర్స్ భావిస్తున్నారు.
తాజా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌తో ‘దేవర’ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజన్స్, కొరటాల శివ టేకింగ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు,ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘దేవర’గా టైటిల్ పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…