‘హరోం హర’ వరల్డ్ బిల్డింగ్, బ్యాక్ డ్రాప్ చాలా ఫ్రెష్ గా వుంటుంది. నా క్యారెక్టర్ ఆడియన్స్ కి గుర్తుండిపోతుంది. తెలుగులో వచ్చిన టాప్ టెన్ యాక్షన్ సినిమాల్లో హరోం హర వుంటుంది: హీరో సుధీర్ బాబు
హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.
డైరెక్టర్ జ్ఞానసాగర్ సెహరి లాంటి రొమాంటిక్ కామెడీ తీశారు. రెండో సినిమాగా హరోం హర లాంటి యాక్షన్ కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది ?
-నేను ముందు సెహరి చూడలేదు. తను నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఏదైనా లవ్ స్టొరీ చెప్తారేమో అనుకున్నాను. హరోం హర కథ చెప్పిన తర్వాత చిన్న షాక్ కి గురయ్యాను. తర్వాత సెహరి చూశాను. సెహరి తన కథ కాకపోయినా తను పుల్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. పేపర్ మీద వున్నది విజువల్ గా ప్రజెంట్ చేయడం డైరెక్టర్ మెయిన్ క్యాలిటీ. సెహరిని అలా ప్రజెంట్ చేయగలిగారు. హరోం హర వరల్డ్ బిల్డింగ్ తనకి ఇంకా ఈజీ అనిపించింది. తను కుప్పం నుంచే వచ్చారు. జనరల్ గా నాకు కథ నచ్చితే మరో ఆలోచన లేకుండా చేసేస్తాను.
-హరోం హర చాలా అథంటిక్ గా చేసిన కమర్షియల్ సినిమా. ఆడియన్స్ కి ఓ కొత్త వరల్డ్ చూసిన ఫీల్ వస్తుంది. ట్రైలర్ చూసి మహేష్ గారు కూడా ఇదే అన్నారు. వరల్డ్ బిల్డింగ్, బ్యాక్ డ్రాప్ ఫ్రెష్ గా వున్న సినిమాలని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చెప్పారు. మహేష్ గారు చాలా ఎక్సయిటెడ్ గా వున్నారు. యాక్షన్ సీన్స్ చాలా బావున్నాయని చెప్పారు.
-సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడూ యాక్షన్ క్యారెక్టర్స్ చేయమని చెప్పేవారు. ఈ సినిమా అయితే ఆయనకి చాలా నమ్మకంగా చూపించేవాడిని.
గన్ స్మిత్ క్యారెక్టర్ చాలా కొత్తగా వుంది.. దీని గురించి ?
-కమర్షియల్ సినిమా చేసినా కథ నుంచి ఓ హీరో పుట్టడమే నా ప్రయారిటీ. ఇందులో కథలో నుంచే ఒక కమర్శియాలిటీ వుంటుంది. బ్యాక్ డ్రాప్ చాలా ఫ్రెష్ గా వుంటుంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో తెలుగులో ఏ సినిమా రాలేదని నా ఫీలింగ్. ఇది బిగ్గర్ యూఎస్పీ. జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్ చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ మన వూర్లో వుంటే. మన పక్కింటి కుర్రాడిలా తను గన్స్ తయారు చేస్తే కొంచెం నాటుగా రా గా వుంటుంది. దిన్ని జేమ్స్ బాండ్ బ్యాక్ డ్రాప్ ఇన్ కుప్పం అనొచ్చు.
-ఇందులో నా క్యారెక్టర్ కి డైలాగ్ మ్యానరిజం వుంటుంది. ‘ఇంక సెప్పెదేమ్ లేదు.. సేసేదే’ అనే డైలాగ్ సినిమాలో చాలా చోట్ల వస్తుంది.
ఈ సినిమాని 80 బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి కారణం ?
-దర్శకుడు ఈ కథని రాసుకున్నపుడు ఆ పిరియడ్ నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇందులో హీరో ల్యాబ్ అసిస్టెంట్. ఆ రోజుల్లో తనకి గన్ తయారు చేసే నాలెడ్జ్ వుందని చూస్తునపుడు అర్ధమైపోతుంది. 80 బ్యాక్ డ్రాప్ అథంటిసిటీని తీసుకొచ్చింది.
ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా హిట్ అవుతుందనే ఫీలింగ్ ఆడియన్స్ లో వచ్చింది. మీకు ఎలాంటి గట్ ఫీలింగ్ వుంది ?
– ఇప్పటివరకూ కొన్ని తప్పులు చేశాం. కానీ ఇందులో అలాంటి తప్పు ఒక్కటీ వుండదు. ఇది బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ సినిమా. ఆడియన్స్ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్తారు. ఈ సినిమా చాలా కాన్ఫిడెన్స్ వుంది. తెలుగులో వచ్చిన టాప్ టెన్ యాక్షన్ సినిమాల్లో హరోం హర వుంటుంది. టాప్ 5 లో వున్నా సర్ ప్రైజ్ అవ్వను. అంత నమ్మకంగా వున్నాం. ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో రండి. ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకుంటుంది. యాక్షన్ లవర్స్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. మంచి ఎమోషన్, యాక్షన్ తో అందరికీ నచ్చే సినిమా ఇది.
ప్రతి సినిమాకి ఫిజిక్, లుక్ ని చేంజ్ చేయడానికి, లుక్ ని మెంటైన్ చేయడానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు ?
-ఫిజిక్ వైజ్ ఈ సినిమాలో చూపించడం లేదు. క్యారెక్టర్ స్ట్రెంత్ కథ నుంచే వస్తుంది. ఇక ప్రతి సినిమాకి ఫిజిక్ విషయంలో తీసుకునే కేర్ గురించి చెప్పాలంటే.,. చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు హీరో అంటే ఇలా వుండాలనే ఓ అభిప్రాయం వుండేది. నేను అలా ఉండటానికి ట్రై చేస్తున్నానంతే. అలాగే క్యారెక్టర్స్ కూడా కొన్ని సార్లు మొటివేట్ చేస్తాయి.
హరోం హర టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?
-ఇందులో ఒక గాడ్ లేయర్ కూడా వుంటుంది. ఒక ఊరులో ఓ సమస్య వుంటుంది. ఆ సమస్యని ఓ వ్యక్తి తీరుస్తాడు. ఆయన ఆక్కడి ప్రజలకు దేవుడిలా అనిపిస్తాడు. ఆ వూర్లో అందరూ సుబ్రహ్మణ్యం స్వామి భక్తులు. అలాగే ఇందులో ఓ నెమలి ఎలిమెంట్ కూడా వుంటుంది. అయితే ఇవి కోఇన్సీడెంట్ గా వుంటాయి. షూటింగ్ కోసం కుప్పంతో పాటు అలా కనిపించే లోకేషన్స్ కి వెళ్లాం. మంగులూర్, ఉడిపి, రాజమండ్రిలో షూట్ చేశాం.
చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఏం మాట్లాడారు ?
-చంద్రబాబు గారికి కంగ్రాజులేషన్స్ చెప్పాను. కుప్పం బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాని చెప్పాను. సినిమాలో చెప్పిన’ఇంక సెప్పెదేమ్ లేదు సేసేదే’ అనే డైలాగ్ ఇప్పుడైన యాప్ట్ అనిపిస్తే చెప్పండని కూడా అన్నాను (నవ్వుతూ). ఆయన నవ్వేశారు.
మీ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ ఇది. ఈ ఒత్తిడి ఉండేదా ? ఫైనల్ అవుట్ పుట్ చూశాక ఏమనిపించింది ?
-ఫైనల్ అవుట్ పుట్ చూశాక ఇప్పటివరకూ ఏ సినిమాకి రాని శాటిస్ఫ్యాక్షన్ వచ్చింది. ఈ సినిమా స్టెప్ లో ఇంత భారీగా తీసున్నామా అనిపించేది. కలర్ పేలట్ చూసిన తర్వాత చాలా కొత్తగా అనిపించింది. ఫైనల్ పుట్ పుట్ చూశాక అద్భుతం అనిపించింది. టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా వుంటుంది. అవుట్ పుట్ చూశాక దర్శకుడికి వందకు వంద మార్కులు వేయాల్సిందే. ట్రైలర్ చూసినప్పుడు ఆడియన్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఫీలయ్యారో సినిమా చూసినప్పుడు కూడా అంతే ఎఫెక్టివ్ గా సర్ ప్రైజింగ్ గా వుంటుంది.
హరోం హరకి సీక్వెల్ ఉందా ?
-హరోం హర కి ఆ స్కోప్ వుంది. అయితే అది వచ్చే రిజల్ట్, ఆడియన్స్ కోరే దాని బట్టి వుంటుంది.
ఇందులో సునీల్ గారి క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-ఆయన సస్పెండెడ్ పోలీస్ కానిస్టేబుల్ గా కనిపిస్తారు. సుబ్రమణ్యం క్యారెక్టర్ కి బ్యాక్ బోన్. పుల్ లెంత్ క్యారెక్టర్. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన రోల్స్ లో ఇది స్ట్రాంగ్ రోల్.
మాళవిక క్యారెక్టర్ గురించి ?
తను చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. భాష నేర్చుకొని నటించడం అంత తేలిక కాదు. తను చాలా ఎమోషనల్ గా చేసింది.
ప్రొడక్షన్ హౌస్ గురించి ?
సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ప్రొడ్యూసర్స్ స్టొరీ మార్కెట్ ని బట్టి సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ నిర్మించారు. చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్స్.
చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ గురించి ?
చేతన్ భరద్వాజ్ మరో అనిరుద్ లా సెట్ అయిపోతాడు. విక్రమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎంత సపోర్ట్ చేసిందో.. ఈ సినిమాకి చేతన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత బలాన్ని ఇస్తుంది. ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఆడియన్స్ కి గుర్తుండిపోతుంది. దీనికి మెయిన్ రీజన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
హరోం హర, మా నాన్న సూపర్ హీరో సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకున్నాయి కదా.. ఎలా బ్యాలెన్స్ చేశారు ?
-క్యారెక్టర్స్ ని లోతుగా అండర్ స్టాండ్ చేసుకుని ఫిగర్ అవుట్ చేసుకుంటే పోట్రేట్ చేయడం ఈజీనే.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…