‘నింద’ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది.. దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం

Must Read

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం ఈ చిత్రానికి సంబంధించిన పంచుకున్న విశేషాలివే..

మీ నేపథ్యం, సినీ ప్రయాణం గురించి చెప్పండి?
మాది నర్సాపురం. చదువుల కోసం నెల్లూరు, చెన్నై, యూఎస్‌ అంటూ తిరిగాను. యూఎస్‌లోనే ఉద్యోగం చేస్తూ ఉండిపోయాను. ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడే ఫిల్మ్ మేకింగ్‌లో కోర్సులు కూడా చేశాను. చిన్న చిన్నగా అక్కడే షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఓ షార్ట్ ఫిల్మ్‌కి అవార్డు కూడా వచ్చింది.

‘నింద’ కథను వరుణ్ సందేశ్‌కే ఎందుకు చెప్పారు?
వరుణ్ సందేశ్‌ గారికి ఈ కారెక్టర్ సెట్ అవుతుందని నమ్మాను. ఆయనకు ఇది మంచి కమ్ బ్యాక్‌లా ఉంటుందని భావించాను. అందుకే ఆయనకు కథ చెప్పాను. వరుణ్ సందేశ్‌కి కథ బాగా నచ్చడంతో సినిమాను ముందుకు తీసుకెళ్లాను.

ఇందులో ఎంత వరకు నిజాలుంటాయి? ఎంత వరకు కల్పితం ఉంటుంది?
కాండ్రకోట మిస్టరీ అని నింద పోస్టర్ వదిలినప్పుడు అందరూ ఘోస్ట్ మీద సినిమా అని రాశారు. సర్లే ఏదో ఒకటి రాశారు.. ప్రమోషన్ కల్పిస్తున్నారని అనుకున్నాను. టీజర్ రావడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని కొన్ని సీన్లు రాసుకున్నాను. కల్పితం కూడా ఉంటుంది.

నిర్మాతగా ఎందుకు మారారు?
నింద కథపై నాకు నమ్మకం ఉంది. నిర్మాతల కోసం ప్రయత్నించాను. వేరే వాళ్లు ఎందుకు? నా సినిమాను నేను నిర్మించాలని ఆ తరువాత అనిపించింది. అందుకే నిర్మాతగానూ మారాను. ప్రతీ రోజూ సెట్స్ మీద మా నాన్న గారు కూడా ఉండేవారు. చిన్న చిన్న ఖర్చులని ఆయన మ్యానేజ్ చేసేవారు.

దర్శకుడిగా సులభంగా అనిపించిందా? నిర్మాతగా సులభంగా అనిపించిందా?
నాకు క్రియేటివ్ ఫీల్డ్ అంటేనే ఇష్టం. దర్శకుడిగానే నాకు నచ్చింది. నాకు సినిమాలు తీయడమే ఇష్టం. సినిమాను తీయడం కంటే రిలీజ్ చేయడం చాలా కష్టమని ఇప్పుడు అర్థం అవుతోంది.

‘నింద’ టెక్నికల్ టీం గురించి చెప్పండి?
పీఎస్ వినోద్ గారి వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన రమిజ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేశారు. విశాల్ చంద్రశేఖర్ వద్ద పని చేసిన సాంతు ఓంకార్ మంచి ఆర్ఆర్, మ్యూజిక్‌ను ఇచ్చారు. ఈ చిత్రానికి టెక్నికల్ టీం మేజర్ అస్సెట్‌గా ఉంటుంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉంటుంది.

‘నింద’లో ఆర్టిస్టులతో చేసిన్ ప్రయాణం గురించి చెప్పండి?
నిందలో ప్రతీ ఒక్క కారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. వరుణ్ సందేశ్ గారు చాలా కొత్తగా కనిపిస్తారు. మైమ్ మధు, అన్నీ ఇలా ప్రతీ పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఈ సినిమాకు చక్కని ఆర్టిస్టుల టీం దొరికింది. మంచి టీం దొరికితే పర్ఫామెన్స్‌లు కూడా బాగా వస్తాయి.

‘నింద’ ఎలా ఉండబోతోంది?
మలయాళం సినిమాలు చూసి.. ఇలాంటి చిత్రాలు మన వద్ద ఎందుకు రావని అంతా అనుకుంటారు. కానీ నింద చూశాకా.. మన వద్ద కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి.. ఇదేదో బాగానే ఉందే.. బాగా తీశారే అని అనుకునేలా ఉంటుంది. అందరికీ నచ్చే చిత్రం అవుతుంది.

నెక్ట్స్ ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయా?
నా దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. కానీ నింద రిలీజ్ అయ్యాక, దాని రిజల్ట్ చూసి నెక్ట్స్ సినిమాలను ప్రకటిస్తాను. ఇకపై ఎక్కువగా సినిమా దర్శకత్వం మీదే ఫోకస్ పెడతాను.

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News