కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్ కి ముహూర్తం ఖరారైంది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకొని, ‘NBK109’ పై అంచనాలను రెట్టింపు చేశాయి. పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ లు అందరినీ కట్టిపడేశాయి. ముఖ్యంగా బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. టైటిల్ తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ కార్తీక పూర్ణిమకి వారి నిరీక్షణకు తెరపడనుంది. తాజాగా టైటిల్ టీజర్ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు.
కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా, నవంబర్ 15న ‘NBK109’ టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. విభిన్న దుస్తులు ధరించి, ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలను చేతబట్టిన బాలకృష్ణ లుక్ ఎంతో శక్తివంతంగా ఉంది. నెత్తురంటిన గొడ్డలిని పట్టుకొని, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో బాలకృష్ణ నిల్చొని ఉన్న రూపం మరో స్థాయిలో ఉంది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను ఎన్నో రెట్లు పెంచేలా ఉంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంచలన స్వరకర్త ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, 2025 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ - ఆటో ఎక్స్పో…
సూపర్ ఇంట్రెస్టింగ్ పేస్‌తో 2 నిమిషాల 27 సెకన్ల ట్రైలర్‌ను విడుదల చేసిన లవ్ ఓటిపి టీమ్. ఒకరికి తెలియకుండా…
మలయాళ సూపర్‌స్టార్..కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియన్ లెవెల్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అన్ని…
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా OG (‘ఓజీ’). DVV ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ…
నవరాత్రి శుభారంభం సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘మర్దానీ 3’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంచి, చెడుకి జరిగే పోరాటాల్ని…