వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలలో మరింత జోరును పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక ప్రగ్యా జైస్వాల్, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది?
2015 లో తెలుగులో నా సినీ ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసి, సినిమా గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పలు మంచి సినిమాల్లో భాగమయ్యాను. మరిన్ని మంచి సినిమాలతో అలరించడానికి ప్రయత్నిస్తున్నాను.
అఖండ, డాకు మహారాజ్, అఖండ-2.. బాలకృష్ణ గారితో వరుస సినిమాలు చేయడం ఎలా ఉంది?
బాలకృష్ణ గారితో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. కోవిడ్ సమయంలో ఎవరూ పెద్దగా సినిమా చేయలేదు. అలాంటి సమయంలో బోయపాటి శ్రీను గారు అఖండ కథ చెప్పి, అంత గొప్ప సినిమాలో నన్ను భాగం చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించి, నా సినీ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు డాకు మహారాజ్ లాంటి మరో మంచి సినిమాలో బాలకృష్ణ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. డాకు మహారాజ్ కూడా ఘన విజయం సాధిస్తుందని, ఈ చిత్రంలోని నా పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను.
డాకు మహారాజ్ లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇందులో నేను కావేరి పాత్ర పోషించాను. నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర ఇది. డీ గ్లామరస్ రోల్ చేశాను. నేను ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. కావేరి పాత్రను బాబీ గారు డిజైన్ చేసిన తీరు బాగుంది. ఈ పాత్ర నాకు నటిగా ఛాలెంజింగ్ గా అనిపించింది. కావేరి పాత్రతో పాటు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.
దర్శకుడు బాబీ గారి గురించి?
బాబీ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం ఇంత కాలానికి వచ్చింది. బాబీ గారు అద్భుతమైన దర్శకుడు. మంచి మనిషి. సెట్స్ లో చాలా కూల్ గా ఉంటారు. నటీనటులను ఒత్తిడికి గురి చేయకుండా, వారి పనిని తేలిక చేసి, మంచి నటనను రాబట్టుకుంటారు. బాబీ గారు కథ చెప్పినప్పుడే ఇది మంచి చిత్రం అవుతుందని నమ్మాను. నేను ఊహించిన దానికంటే గొప్పగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బాలకృష్ణ గారిని సినిమాలో చాలా కొత్తగా చూపించారు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.
బాలకృష్ణ గారి గురించి?
బాలకృష్ణ గారికి సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ, ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తనలో తాను స్ఫూర్తి నింపుకోవడమే కాకుండా, ఇతరులలోనూ ఆ స్ఫూర్తి నింపుతూ ఉంటారు. సెట్స్ లో బాలకృష్ణ గారు అందరితో ఎంతో సరదాగా ఉంటారు. సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకోవచ్చు. ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చారంటే, నటుడిగా దర్శకుడికి ఏం కావాలంటే అది నూటికి నూరు శాతం ఇస్తారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ గురించి?
తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. సితారలో ప్రతి ఒక్కరూ సినిమా పట్ల ఎంతో పాషన్ తో ఉంటారు. నాగవంశీ గారు గొప్ప నిర్మాత. దర్శకులను, టీంని ఎంతో నమ్ముతారు. అందరిని స్వేచ్ఛగా పని చేసుకోనిస్తారు. వంశీ గారు తక్కువ మాట్లాడతారు.. కానీ ఎప్పుడూ మంచి సినిమాలను అందించడానికి తపిస్తూ ఉంటారు.
తమన్ గారి సంగీతం గురించి?
మన సినీ పరిశ్రమలో ఉన్న గొప్ప సంగీత దర్శకులలో తమన్ గారు ఒకరు. ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాల్లో ఆయన సంగీతం మరింత గొప్పగా ఉంటుంది. ‘డాకు మహారాజ్’ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. నాకు ది రేజ్ ఆఫ్ డాకు సాంగ్ ఎంతగానో నచ్చింది. దబిడి దిబిడి, చిన్న సాంగ్స్ కూడా బాగున్నాయి. పాటలతో పాటు ఈ చిత్ర నేపథ్య సంగీతం కూడా బాగుంటుంది.
జనవరి 12 మీ పుట్టినరోజు కదా.. అదే రోజు డాకు మహారాజ్ విడుదలవుతుండటం ఎలా ఉంది?
పుట్టినరోజు ప్రతి ఏడాది వస్తుంది. కానీ బాలకృష్ణ గారి సినిమా అనేది ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆయనతో కలిసి నేను నటించిన సినిమా నా బర్త్ డేకి విడుదల కావడం నా అదృష్టం. ఇది నా పుట్టినరోజుకి ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను. అలాగే నేను నటించిన సినిమా సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు విడుదలవుతుండటం కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా డాకు మహారాజ్ తో పాటు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మీ డ్రీం రోల్ ఏంటి? ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
ఎస్.ఎస్. రాజమౌళి గారు, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకులు తీసే భారీ సినిమాలలో శక్తివంతమైన పాత్రలు పోషించాలని ఉంది. అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలని ఉంది.
వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల,…
గీత రచయితగా తన ప్రస్థానం చాలా సంతృప్తికరంగా సాగుతోందని అన్నారు ప్రముఖ లిరిసిస్ట్ కేకే(కృష్ణకాంత్). గతేడాది రాసిన పాటలన్నీ ఛాట్…
Famous lyricist KK (Krishnakanth) shared that his journey as a lyricist has been progressing very…
ప్రేక్షకులు ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో…
Versatile actor Aditya Om’s upcoming film Bandi which is inspired by the urgent and timely…
సాయి కుమార్ అంటే అందరికీ నాలుగు సింహాల డైలాగ్ గుర్తుకు వస్తుంది. పోలీస్ స్టోరీ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలో…